అమలాపురం
నా ఫోన్ కూడా టాపింగ్ చేశారు... వైయస్ షర్మిల
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశానికి ఏపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల హాజరయ్యారు. ఈ సందర్భంగా షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తను కూడా టాపింగ్ చేసినట్లు వైవి సుబ్బారెడ్డి తన ఇంటికి వచ్చి చెప్పారు అన్నారు. ఫోన్ టాపింగ్ వ్యవహారం అత్యంత దారుణమని దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో చాలామంది ఫోన్లు టాపింగ్ చేసారన్నారు. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే హక్కు ఎవరికీ లేదని తెలిపారు.