అమలాపురం
దాడి చేస్తున్న వారిని ప్రశ్నించినందుకు ఒక మహిళపై మరియు సామాన్యులపై దాడి చేసిన వైనంసామాన్యులపై దాడిని తీవ్రంగా ఖండించిన అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా జనసేన కార్యకర్తలు అభిమానులు మండలంలోని పలు గ్రామాల్లో సైలెన్సర్ తీసిన బైకులతో మరియు కత్తులు పట్టుకుని స్వైర విహారం చేశారు. దానిలో భాగంగా ఈతకోట గ్రామంలో గౌడ రామాలయం వద్ద సైలెన్సర్లు తీసిన బైకులతో రచ్చ చేస్తుంటే ఆ గ్రామస్తులు నిలదీసి అడగగా వారిపై నిర్దాక్షిణ్యంగా దాడికి దిగారు. అప్పుడే స్కూల్ కి వెళ్లి తిరిగి వస్తున్న ఒక...