విద్యుత్ బారాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలి
విశ్వం వాయిస్ న్యూస్, కాజులూరు
విద్యుత్ భారాలు, ట్రూ అప్ చార్జీలు,పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై భారాలు వేస్తుందని, వీటికి వ్యతిరేకం గా ప్రజలు ఉద్యమం చేయాలని కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్సులు ఎం రాజశేఖర్, వళ్ళు రాజబాబు పిలుపునిచ్చారు. కాజులూరు మండలం, శీల్లంక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ ప్రజలతో కలిసి విద్యుత్ బారాలకు వ్యతిరేకం గా ప్రతిజ్ఞ కార్యక్రమం చేపట్టట్టారు. స్మార్ట్ మీటర్లు రద్దు, సెకి ఒప్పందం రద్దు చేయాలని, ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ కమిషన్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వేయబోయే మరో చార్జీలు భారాలు కు వ్యతిరేకంగా ఆగష్టు 28 ప్రతిజ్ఞ దినం పాటింంచినట్లు తెలిపారు. స్మార్ట్ మీటర్ వద్దు అంటే...
ఘనంగా యేసురాజు జన్మదిన వేడుకలు
విశ్వం వాయిస్ పాలిటికల్ డెస్క్, కాకినాడ
కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామానికి చెందిన రామచంద్రపురం నియోజకవర్గ టీడీపీ నాయకులు గుబ్బల యేసురాజు జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పలుచోట్ల కేకులు కట్ చేసి ఆయన వేడుకలు జరుపుకున్నారు. ఈ మేరకు పలువురు నాయకులు, కార్యకర్తలు యేసురాజుకి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన్ని పూలదండలు, దుస్సాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ టేకుముడి సత్యనారాయణ, టీడీపీ నాయకులు దంగేటి గౌరీశంకర్, వెంకటరమణ, బోమిడి సోమాలమ్మ, వి ధరణి, తోట కృష్ణ తదితరులు పాల్గొన్నారు.