విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా సెప్టెంబర్ ఒకటో తేదీన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి విచ్చేస్తున్న సందర్భంగా బిజెపి నాయకులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తూర్పుగోదావరి జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి, కొవ్వూరు మండల ఇన్చార్జ్ చెట్టుపల్లి శివ నాగరాజు అన్నారు. కొవ్వూరు పట్టణంలోని గురువారం బూత్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా శివ నాగరాజు మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో బిజెపి పార్టీ ఎంతో బలోపితంగా ఉందని, కుల మత చిన్న పెద్ద తేడా లేకుండా అందర్నీ ఆహ్వానించడం జరుగుతుందని అన్నారు. మండలంలోని బూత్ కమిటీ సభ్యులను కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా కృషి చేయాలని తెలుపుతామన్నారు. ఈ...
కొవ్వూరు పట్టణంలోని విజయ విహార్ సెంటర్ నందు భారతీయ జనతా పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో 200 జాతీయ జెండాలను పంపిణీ
విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు
బ్రిటిష్ వారు భారతదేశ విడిచి వెళ్లడానికి ముందు రోజే రాజకీయ ప్రయోజనాల కొరకు భారతదేశాన్ని విభజించి, హిందువులను ఊచకోత కు గురిచేసిన సంఘటన ఎప్పటికీ మరిచిపోలేమని భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర అన్నారు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా లో భాగంగా గురువారం కొవ్వూరు పట్టణంలోని విజయ విహార్ సెంటర్ నందు భారతీయ జనతా పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో 200 జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పిక్కి...