భార్యా భర్తలను చంపాలనే కక్షతోనే తుపాకీ కాల్పులు
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, శంఖవరం
భార్యాభర్తలు ఇరువురునీ ఏక మొత్తంగా మట్టుబెట్టాలనే కక్షతోనే శృంగధార గిరిజన గ్రామంలో ఇటీవల నాటు తుపాకీ కాల్పులు ఘటన చోటు చేసుకుంది. కాల్పులకు తెగబడ్డ రాజవొమ్మంగి మండలం వాతంగి గ్రామానికి చెందిన నిందితుడు ముర్ల మణికంఠ కుమార్ ను పోలీసులు బుధవారం అదుపులోనికి తీసుకున్నారు. అతన్నుంచి నాటు తుపాకీని, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అతన్ని రిమాండ్ విధింపు నిమిత్తం ప్రత్తిపాడు కోర్టులో గురువారం హాజరు పరచ నున్నారు. ఈ మేరకు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరం పోలీస్ స్టేషన్లో బుధవారం సాయంత్రం మీడియా సమావేశంలో పెద్దాపురం డిఎస్పీ డి.శ్రీహరిరాజు హత్యా యత్న ఘటన...