విశ్వం వాయిస్ పాలిటికల్ డెస్క్, మండపేట
సహకార సంఘాల ద్వారా రైతులకు మెరుగైన సేవలను అందించాలని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్,మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం జరిగిన మండపేట మండలం,జెడ్ మేడపాడు ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే వేగుళ్ళ పాల్గొన్నారు.అధ్యక్షులుగా సలాది బాలసుబ్రమణ్యం, సభ్యులుగా సంగిశెట్టి అమ్మన్న, బోయిడి వెంకటరమణలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగుళ్ళ కూటమి నాయకులు, రైతులతో కలసి నూతన కమిటి సభ్యులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, మండపేట...
కౌన్సిలర్ మందపల్లి రవి...
విశ్వం వాయిస్ ప్రాంతీయ డెస్క్, మండపేట
మండపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 7,8 వార్డులలో సీసీ రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని, గోతులతో నిండిపోయాయని,సిసి రోడ్లు డ్రైనేజీల్లో ఒరిగిపోయాయి అని వెంటనే వాటిని పరిష్కరించి తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను 8 వార్డ్ కౌన్సిలర్ మందపల్లి రవి కోరారు. మండపేట టౌన్ పరిధిలో 30 వార్డులకు సీసీ రోడ్ల రిపేరు పనుల నిమిత్తం 17 లక్షలు శాంక్షన్ అయ్యి మూడు నెలలు గడిచిన నేటి వరకు ఈ రోడ్డు రిపేర్ పనులకు మోక్షం కలగలేదని అన్నారు. ఎంపీడీవో ఆఫీస్ కి వెళ్లే రోడ్డు ఇదే కావడంతో ప్రజలు ప్రతిరోజు తమ సమస్యల నిమిత్తం చాలామంది ఈ రోడ్ గుండా వెళ్తారని...
విశ్వం వాయిస్ పాలిటికల్ డెస్క్, మండపేట
వైయస్సార్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మండపేట నియోజకవర్గ యువజన విభాగం కన్వీనర్ చోడే శ్రీకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు.యువజన విభాగం ద్వారా చేస్తున్న కార్యక్రమాలు గూర్చి ఏపీ సబార్బినేట్ కమిటీ చైర్మన్,ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వివరించగా జగన్ ప్రత్యేకంగా అభినందించారని శ్రీకృష్ణ ఆనందం వ్యక్తంచేశారు. యువజన విభాగం బలోపేతానికి కృషిచేయాలని సూచించారన్నారు. మాజీ ఎమ్మెల్యే బిక్కిన కృష్ణార్జున చౌదరి, పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాజుబాబుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నట్టు శ్రీకృష్ణ తెలిపారు.
విశ్వం వాయిస్ పాలిటికల్ డెస్క్, మండపేట
వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గా మండపేట కు చెందిన ఎర్రగుంట మణికంఠ కుమార్ (అయ్యప్ప) నియమితులయ్యారని పార్టీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనని నియమించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ,మండపేట నియోజకవర్గ వైసిపి ఇన్ఛార్జ్, ఎమ్మెల్సీ , రాష్ట్ర సబర్డినేట్ కమిటీ చైర్మన్ తోట త్రిమూర్తులకు కృతజ్ఞతలు తెలిపారు.తనకు ఇచ్చిన ఈ బాధ్యతను 2029 లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి శాయశక్తుల కృషి చేస్తానని, ప్రజా సమస్యలను పరిష్కరించడానికి వైయస్సార్ పార్టీ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడానికి తన వంతు...
విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, బీజేపీ సంస్థాగత నియామకాలలో భాగంగా మండపేట నియోజవర్గం రాయవరం మండలం, లొల్ల గ్రామంలో మండల భాజపా అధ్యక్షులు శాకా దుర్గా శ్రీనివాస్ అధ్యక్షతన నూతనంగా జిల్లా పదవులు పొందిన నాయకులను బిజెపి మండపేట నియోజకవర్గ కన్వీనర్ కె వి వి సాయిరామ్ ఘనంగా సత్కరించారు. నూతన జిల్లా కమిటీకి ఉపాధక్షులుగా రాయవరం మండలం లొల్ల గ్రామ సర్పంచ్ చాట్రాతి జానకి రాంబాబు ను రెండవసారి నియమించగా, మరొక ఉపాధక్షులు గా వెదురుపాక కు చెందిన పార్టీ సీనియర్ నాయకురాలు శ్రీదేవి ని ఎన్నుకున్నారు. జిల్లా కార్యవర్గ సభ్యులుగా పూర్వ మండల అధ్యక్షులు రాయి వీర్రాజు, తుమ్మలపల్లి సూర్యనారాయణ, నరాల రాంబాబు,...
ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నా...
జెఏసి సమావేశం లో ఎమ్మెల్యే వేగుళ్ళ...
విశ్వం వాయిస్ పాలిటికల్ డెస్క్, మండపేట
మండపేట ప్రజల ఆకాంక్ష మేరకు మండపేట ను రాజమహేంద్రవరం కేంద్రంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో విలీనం చేసేందుకు కృషిచేస్తానని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ , మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు స్పష్టం చేశారు. తను ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. మండపేట లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో ఆదివారం జెఏసి చైర్మన్ కామన ప్రభాకరరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంకు ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే వేగుళ్ళ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండపేట టౌన్, మండలం విలీనం చేసేందుకు ఇక్కడి ప్రజలు వంద శాతం సుముఖంగా...
కార్యకర్తలతో కోలాహలంగా మారిన పార్టీ కార్యాలయం...
విశ్వం వాయిస్ పాలిటికల్ డెస్క్, మండపేట
మండపేట నియోజకవర్గ ఇంచార్జ్ మరియు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు రాష్ట్ర సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ గా ఎంపిక చేయడం పట్ల మండపేట వైసీపీ కార్యాలయంలో కార్యకర్తలు, అభిమానుల అభినందనలతో ముంచెత్తారు. శాసనసభ కమిటీలలో అత్యంత కీలకమైన సబార్డినేట్ కమిటీ చైర్మన్ గా ఆయన నియామకం జిల్లా ప్రజలకు ఆనందదాయకమని కార్యకర్తలు అభిమానులు పేర్కొన్నారు. రాజకీయాలలో సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడిగా గుర్తింపు పొందిన ఈయనకు కీలక బాధ్యతల అప్పగించడం పట్ల వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తపరిచారు. సాలువాలతో పూలమాలలతో ఆయన్ని కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. వైసిపి పార్టీ కార్యాలయంలోకి ఆదివారం తోట రాగానే రంగు రంగు పుష్పాలు పూల...
విశ్వం వాయిస్ న్యూస్, మండపేట
మండపేట పట్టణంలో వేంచేసియున్న శ్రీ జనార్ధన శ్రీ అగస్త్యేశ్వర స్వామి వార్ల దేవస్ధానం (రధం గుడి) పునఃనిర్మాణ అభివృద్ధి పనులకు ఆదివారం రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు శంకుస్థాపన చేశారు.తొలుత ఎమ్మెల్యే వేగుళ్ళ రధం గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి దేవాలయ ధ్వజస్తంభం వద్ద కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు.
ఈ అభివృద్ధి పనుల్లో భాగంగా స్లాబ్ లీకేజీలను అరికట్టడం, శిదిలావస్తుకు చేరిన వాటిని తొలగించడం, వాస్తు మార్పులను చేపడుతారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ళ మాట్లాడుతూ ఈ అభివృద్ధి పనుల పర్యవేక్షణకు రధం గుడికి ప్రతీ రోజు వచ్చే భక్తులతో నిర్మాణ కమిటీని ఏర్పాటు చేయవలసిందిగా ఆలయ అధికారులను ఆదేశించారు.ఈ...
చట్టాల రక్షణ లో శునక మహారాజులు
ప్రజా ప్రతినిధులకు మొర పెట్టినా మొండి చేయి
మండలంలో విస్తారంగా పెరిగిపోయిన గ్రామ సింహాలు
రంగు నీటి డబ్బా లే రక్షణ గా ప్రజల పాట్లు
విశ్వం వాయిస్ స్పెషల్ రిపోర్ట్ టీం, రాయవరం
మండలంలో గ్రామ సింహాలు సృష్టిస్తున్న అలజడితో పలు గ్రామాల ప్రజలు నిత్యం భయంతోనే బ్రతుకీడుస్తున్నారు, ప్రతి వీధిలోను పదుల సంఖ్యలో వీధి కుక్కలు గుంపులుగా చేరి, ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తాయో.? ఏ ప్రమాద వార్త తమ చెవిన పడుతోందో ? అనే ఆందోళనలోనే ప్రజానికం సతమతమవుతున్నారు. ప్రధాన రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు వెళ్లే మార్గాలు, ఇతర రహదారులపై వీధి కుక్కలు గుంపులుగా సంచరిస్తూ, కార్యాలయాలకు వివిధ అవసరాల కోసం వచ్చే ప్రజలకు, పాఠశాలకు...
విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట నియోజకవర్గం ,రాయవరం మండలం, చెల్లూరు చెల్లూరు గ్రామంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యాపుల కేశవ్ పర్యటించిన సందర్భంగా, నియోజకవర్గంలోని పలు చేనేత సంఘాలు మంత్రిని కలిసి, తమ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాలు అందజేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు,దివంగత నేత,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పరిపాలనలో, పని లేక ఇబ్బంది పడుతున్న చేనేత కార్మికులను ఆదుకుని భోజనం పెట్టారని, ఆయన ప్రవేశపెట్టిన జనతా వస్త్రాల పధకం ద్వారా చేనేత కార్మికులందరూ జనతా వస్త్రాలు తయారుచేసి ఉపాధి పొందారని, కానీ ఇప్పుడు మరల గడ్డుకాలం ఏర్పడి మరమగ్గాల...