అమలాపురం
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ను విమర్శించే స్థాయి పితాని బాలకృష్ణ కు లేదని అమలాపురం శెట్టిబలిజ సంఘ నాయకులు మండిపడ్డారు. ఆదివారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో వారు మాట్లాడారు. స్థాయి మరిచి నోటికి వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని తీవ్ర స్వరంతో హెచ్చరించారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో చరిష్మా ఉన్న యువ నాయకుడు మంత్రి సుభాష్ ను విమర్శించే స్థాయా నీది..? అంటూ ప్రశ్నించారు. మంత్రి సుభాష్ శెట్టిబలిజ కులానికి, అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా పేద, బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలకు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, పేద విద్యార్థుల కోసం చేస్తున్న సేవలు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. ఒకపక్క ప్రభుత్వ పరంగానే...