₹20 కోట్ల మోసం — షేర్ మార్కెట్ నిపుణుడిని నమ్మి 170 మంది పెట్టుబడులు
అధిక వడ్డీ ఆశ చూపి విశ్రాంత ఉద్యోగులు, వృద్ధుల వద్ద నుంచి లక్షల్లో వసూలు
వడ్డీ చెల్లింపులు ఆపి పరారి అయిన దినేశ్ పాణ్యం.. కార్యాలయానికి తాళం
బాధితుల ఆవేదన: ప్రభుత్వంతో పాటు పోలీసుల నిర్లక్ష్యంపై వాపోలు
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, హైదరాబాద్
మల్కాజిగిరిలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. అధిక వడ్డీ ఆశ చూపి సుమారు 170 మందిని మోసం చేసి రూ.20 కోట్లు తీసుకొని ఓ వ్యక్తి పరారైన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ మోసం వెనక ఉన్న నిందితుడు దినేశ్ పాణ్యం, తనను షేర్ మార్కెట్ నిపుణుడిగా పరిచయం చేసుకొని విశ్రాంతులు, వృద్ధులు, ఐటీ ఉద్యోగుల...