రాష్ట్రస్థాయి సౌత్ జోన్ అథ్లెటిక్ క్రీడా పోటీలకు ముగ్గురు విద్యార్థులు ఎంపిక
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ రూరల్
రాష్ట్రస్థాయి సౌత్ జోన్ క్రీడా పోటీలకు మాదపట్నం జడ్పీ పాఠశాలకు చెందిన ముగ్గురు క్రీడాకారులు ఎంపికయ్యారని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు టి.మురళీకృష్ణ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 3న పెద్దాపురం మహారాణి కాలేజీ క్రీడా మైదానంలో జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ముగ్గురు క్రీడాకారులు ప్రతిభ కనబరిచారన్నారు. వీరు అండర్ - 18 విభాగంలో డి. రాజేష్ (1000 మీ) ప్రథమ స్థానం, ఎన్. యుగేష్ (400 మీ) ద్వితీయ స్థానం, అండర్- 14 విభాగంలో ఆర్.పవన్ గణేష్ (జావెలిన్) ప్రథమ స్థానాలు సాధించి రాష్ట్రస్థాయి సౌత్...