అమలాపురం రూరల్
అమలాపురం పురపాలక సంఘం పరిధిలోని బోడసకుర్రు టిడ్కో గృహ సముదాయం వద్ద అమలాపురం పురపాలక సంఘం కమీషనర్ వి.నిర్మల్ కుమార్ ఆదేశాల మేరకు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులచే ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించారు. టిడ్కో గృహ సముదాయం వద్ద కొన్ని రోజులుగా పేరుకుపోయిన చెత్తను తొలగింపచేసి,పిచ్చిమొక్కలు తొలగింప చేశారు. డ్రైన్ లలో పేరుకుని పోయిన చెత్తను ,ఇతర వ్యర్థాలను తొలగించి, శుభ్రం చేయించారు. టిడ్కో గృహ సముదాయం వద్ద నివసిస్తున్న ప్రజలతో మాట్లాడి ,వారి సమస్యలు తెలుసుకుని, త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఏఈ కె.వెంకటేష్, టిడ్కో స్పెషలిస్ట్ అధికారి డా.డి.లలిత , శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రెటరీలు, ప్లానింగ్ రెగ్యులేషన్ సెక్రెటరీలు మరియు శానిటేషన్ మేస్త్రీలు పాల్గొన్నారు.