సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం విజయవంతం చేయండి
ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు
తాళ్లరేవు, ముమ్మిడివరం నియోజకవర్గం
జూలై రెండవ తారీకు నుండి జరగబోయే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ నాయకత్వ లక్షణాలను అలవర్చుకుని ప్రజా సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని -ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు సూచించారు.ఐ పోలవరం మండలం పరిధిలోని మురమళ్ళ పార్టీ కార్యాలయం దగ్గరలో గల శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి కళ్యాణ మండపంలో పార్టీ నియోజకవర్గం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో రేపటి నుండి ప్రతి గ్రామంలో మండల,గ్రామ...