విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, అల్వాల్
అల్వాల్‌లోని ఓ జిమ్‌లో పరిచయమైన యువతిని కబంధం చేసుకోవడానికి ప్రయత్నించిన మైనంపల్లి హన్మంతరావు అనుచరుడు రవి అలియాస్ రఫీ మరోసారి వార్తల్లో నిలిచాడు. నిత్య పెళ్లికొడుకు పేరుతో ఇప్పటికే ముగ్గురిని పెళ్లి చేసుకున్న రవి, ఈసారి కొత్తగా పరిచయమైన యువతిని వేదింపులకు గురిచేశాడు.
పోలీసుల సమాచారం ప్రకారం, జిమ్‌లో పరిచయం అయిన ఆ యువతి కారులో రవి గుప్తంగా ట్రాకింగ్ డివైస్ అమర్చాడు. ఆ తర్వాత ఆమె ప్రైవేట్ సంభాషణల్ని రికార్డు చేసి, వాటిని మార్ఫింగ్ చేసి డబ్బు కోసం బెదిరించడం ప్రారంభించాడు. రూ.10 లక్షలు ఇవ్వాలని, అంతేకాక స్థానిక నేతపై తప్పుడు ఫిర్యాదు ఇవ్వాలని కూడా బలవంతం పెట్టాడని ఆరోపణలు ఉన్నాయి.
ఇక ఆ యువతి ధైర్యం...