ఒక్కొక్కరికి 25 కేజీల రైస్ బ్యాగులను ఉచితంగా పంపిణీ
జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా అందరికీ ఉమ్మడిగా ఇన్సూరెన్స్ అందిస్తానన్న జ్యోతుల నవీన్
అర్హులైన ప్రతి ఆటో కార్మికుడికి మూడు సెంట్లు భూమిని అందిస్తాం
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
జగ్గంపేట నియోజకవర్గం లోని ప్రతి ఆటో కార్మిక సోదరుడికి అండగా నిలుస్తానని జగ్గంపేట శాసనసభ్యులు టిటిడి బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ అన్నారు. జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఆటో కార్మికులందరికీ ఉమ్మడి ఇన్సూరెన్స్ చేయిస్తానన్న కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ .గోకవరం మండలంలో ఆటో కార్మికులకు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 25 కేజీల బియ్యం బస్తాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ...
మత్స్యకార సంఘం అధ్యక్షుడుబత్తిన రామకృష్ణ ఆధ్వర్యంలో పలువురు టిడిపిలో చేరిక
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గొల్లలకుంట మత్స్య సహకార సంఘం నెంబర్ 3-90 నూతన పాలకవర్గ సంఘ సభ్యులు తిరుమలరాజు మురళి రాజు ఆధ్వర్యంలో సంఘ సభ్యులు అందరూ శనివారం స్థానిక రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. మత్స్యకార సంఘం అధ్యక్షుడు బత్తిన రామకృష్ణ ఆధ్వర్యంలో పలువురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. తలారి చిన్న అప్పారావు, తలారి సత్తిబాబు, ఇజ్జీన ప్రేమా నందం, రేగుళ్ల వీర వెంకటరమణ, చింతపల్లి సూరిబాబు, తలారి పెద్ద అప్పారావు, ఈ...
ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి అండగా నిలుస్తున్న లోకేష్ కృషి ప్రశంసనీయం
ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో శాసనసభ్యులు, టిటిడి బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు .ఈ సందర్బంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ తెలుగు వారికి అపద అనే పదం వినబడితే చాలు నన్ను దాటి వారిని టచ్ చేయాలనే విధంగా మానవతా దృక్పథంతో ఆపదకే అడ్డుగా నిలిచారు. నారా లోకేష్ అని అన్నారు.నేపాల్ లో జరుగుతున్న మారణోమంలో తెలుగు వారు ఉన్నారని తెలియగానే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్పందించారు.అనంతపురం పర్యటనను రద్దు చేసుకుని, ఉదయాన్నే హుటాహుటిన సచివాలయానికి చేరుకున్నారు. రియల్టైం గవర్నెన్స్ సెంటర్...
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్లూరు గ్రామంలో గల పుష్కర అంతర్భాగం తాళ్లూరు లిఫ్ట్ ప్రధాన కాలువ యొక్క కి.మీ 45.195 వద్ద ఉన్న తాళ్లూరు లిఫ్ట్ పంప్ హౌస్ వద్ద ఉన్న పి ఎస్ సి ప్రెజర్ మెయిన్‌ను ఎం ఎస్ ప్రెజర్ మెయిన్‌తో భర్తీ చేయడానికి పరిపాలనా ఆమోదంతో కూడిన ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి అని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలియజేశారు. 52 కోట్లతో పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. అదేవిధంగా మల్లవరం ఎత్తిపోతల పథకానికి 140 కోట్లు రూపాయలు మరో 10 రోజుల్లో పరిపాలన ఆమోదం పొందడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా మా పెద్ద తండ్రి జ్యోతుల పాపారావు...
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
జగ్గంపేట నియోజకవర్గంలో ఎరువుల బ్లాక్ మార్కెట్‌పై అన్నదాత పోరుకి శ్రీకారం చుట్టారు. మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, జగ్గంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ తోట నరసింహం ఆదేశాల మేరకు మండల వైసీపీ అధ్యక్షులు రావుల గణేష్ రాజా ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది.
ఈ సందర్భంగా గణేష్ రాజా మాట్లాడుతూ, జగ్గంపేటలో రైతులు యూరియా సహా ఎరువుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, కూటమి ప్రభుత్వం విస్మరించినట్లుగా వ్యవహరిస్తోందని అవేదన వ్యక్తం చేశారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం కోసం సెప్టెంబర్ 9న నియోజకవర్గ ఇన్‌చార్జ్ తోట నరసింహం ఆధ్వర్యంలో ఆర్డీవోకు వినతి పత్రాలు అందజేయనున్నట్టు తెలిపారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్లు
1. యూరియా...
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
మాజీ మంత్రి, వైసీపీ పీఏసీ సభ్యులు ముద్రగడ పద్మనాభం నివాసంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఒమ్మి రఘురాం ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఒమ్మి రఘురాం మాట్లాడుతూ ప్రత్తిపాడు నియోజకవర్గ పరిశీలకునిగా పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియమించబడినట్లు పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి ముద్రగడ గిరిబాబు ఆధ్వర్యంలో తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు.
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, జగ్గంపేట
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన జీను మణి బాబును జగ్గంపేట మేదర సంఘం అధ్యక్షులు పిల్లి రమణ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ మా అభిమాన నాయకుడు జీనుమణి బాబును జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, నియోజవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్, జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ మండల పార్టీ అధ్యక్షుడుగా నియమించిన శుభ సందర్భంగా ఆయనను మర్యాదపరంగా కలిసి సత్కరించామని మా సమస్యలు వారికి తెలియజేసామని రమణ అన్నారు. జీను మణిబాబు మాట్లాడుతూ మీ సమస్యలను ఎమ్మెల్యే నెహ్రూ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రొట్ట...
స్మార్ట్ గవర్నమెంట్
స్మార్ట్ ఆలోచన
జగ్గంపేటశాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, జగ్గంపేట
కాకినాడ జిల్లా గండేపల్లి రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలకు చెక్ పెడుతూ రేషన్ వ్యవస్థను ప్రక్షాళన చేసేలా లబ్ధిదారులకు స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుందని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. మంగళవారం గండేపల్లి మండలం నాయకంపల్లి గ్రామం నందు నిర్వహించిన కార్యక్రమంలో శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఇది తమ కూటమి ప్రభుత్వానికి వచ్చిన స్మార్ట్ ఆలోచన అని, గతంలో మాదిరిగా పెద్ద పుస్తకాల వలే కాకుండా ఏటిఎం, ఆధార్ కార్డుల తరహాలో రాజముద్రతో పాటు లబ్ధిదారుడు చిత్రం ఉండే...
స్మార్ట్ గవర్నమెంట్‌స్మార్ట్ ఆలోచన
జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
కాకినాడ జిల్లా కిర్లంపూడి రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలకు చెక్ పెడుతూ రేషన్ వ్యవస్థను ప్రక్షాళన చేసేలా లబ్ధిదారులకు స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుందని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. సోమవారం కిర్లంపూడి మండలం సోమరాయణం పేట గ్రామం నందు నిర్వహించిన కార్యక్రమంలో శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఇది తమ కూటమి ప్రభుత్వానికి వచ్చిన స్మార్ట్ ఆలోచన అని, గతంలో మాదిరిగా పెద్ద పుస్తకాల వలే కాకుండా ఏటిఎం, ఆధార్ కార్డుల తరహాలో రాజముద్రతో పాటు లబ్ధిదారుడు చిత్రం...
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు గర్వకారణమైన రోజు ఇది అని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి 30 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూనేటి రోజు రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయి సరిగ్గా 30 సంవత్సరాల క్రితం, 1995 సెప్టెంబర్ 1న నారా చంద్రబాబు నాయుడు తొలిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు అని అన్నారు.గత మూడున్నర దశాబ్దాలుగా నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన, రాష్ట్ర పరిపాలనలో విప్లవాత్మక...