14 October 2025
Tuesday, October 14, 2025
టెలిగ్రామ్
తాజా అప్డేట్స్ కోసం — మన టెలిగ్రామ్ చానల్‌లో చేరండి
చేరండి

రాజమహేంద్రవరం

జూనియర్స్ కబడీ సెలెక్షన్స్ కి వర్షం దెబ్బ

- మరలా సెలెక్షన్స్ ఎప్పుడనేది తెలియజేస్తా మన్న అసోసియేషన్ - హాజరైన 19మండలాల క్రీడాకారులు - రాజమండ్రిలో క్రీడాకారుల కు ఇండోర్ స్టేడియం ఏర్పాటు చెయ్యాలి.. - బురిడీ త్రిమూర్తులు, మల్లికార్జున్ విశ్వం వాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఎస్కేవీటీ డిగ్రీ కాలేజి క్రీడా మైదానంలో జూనియర్స్ కబడ్డీ బాయ్స్, గర్ల్స్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు.తూర్పు గోదావరి జిల్లా 19 మండలాల నుండి 250 మంది బాలురు,150 మంది బాలికలు కబడ్డీ ఎంపికకు హాజరయ్యారు. ఈసందర్బంగా తూర్పు గోదావరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ బురిడి త్రిమూర్తులు మాట్లాడుతూ క్రికెట్ తర్వాత కబడ్డీ క్రీడకు ఎక్కువ ప్రాధాన్యత ఉందన్నారు.ఈమధ్య ప్రో కబడ్డీ లీగ్స్...

తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కీర్తి చేకూరి

విశ్వం వాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం తూర్పు గోదావరి జిల్లా కొత్త కలెక్టర్‌గా కీర్తి చేకూరి మాట్లాడుతూ, ఏపీ ట్రాన్స్ కోలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తూ , రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు మేరకు శనివారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించడం జరిగిందనీ తెలిపారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తానని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయంతో తూర్పు గోదావరి జిల్లా అగ్రగామిగా నిలిపేందుకు తన వంతు కృషి చేస్తానని కలెక్టర్ కీర్తి పేర్కొన్నారు. రానున్న 2027 గోదావరి మహా పుష్కరాలు నేపథ్యంలో ఇప్పటి నుంచే...

మల్లిడి శ్రీనివాసరెడ్డి పై వెంటనే కేసు నమోదు చేయాలి – దొండపాటి దుర్గ

-మమ్మల్ని కులం పేరుతో దూషించి.. వేధిస్తున్నారు.. -దొండపాటి దుర్గ ఆవేదన విశ్వం వాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం రాజానగరం మండలం సూర్యారావుపేట గ్రామానికి చెందిన తాను బతుకుతెరువు నిమిత్తం పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని దొండపాటి దుర్గ తెలిపింది. రంగంపేట మండలం ఈలగోలను గ్రామానికి చెందిన నురుకుర్తి సాల్మన్ రాజు కుమార్తె ముత్య మాధురి పామాయిల్ తోటలో కూలి పని చేస్తుండగా పక్క పొలానికి చెందిన మల్లిడి శ్రీనివాసరెడ్డి అనే ఆసామి తమను వీడియోలు తీసి, కులం పేరుతో దుర్భాషలాడుతూ ఇబ్బందులకు గురి చేశాడని ఆరోపించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ గతంలో ఆ పొలం తాను కౌలుకు తీసుకున్నానని అక్కడ పని చేయొద్దు అంటూ...

ఆ పామాయిల్ తోట నాది – నురుకుర్తి వీరలక్ష్మి

‌సుప్రీంకోర్టు ఇటీవల ఆస్తిపై నాకు ఆర్డర్ కూడా ఇచ్చింది ముత్య మాధురికి, సాల్మన్ రాజుకు ఆ పామాయిల్ తోటపై ఎలాంటి హక్కు లేదు వారినుంచి నాకు ప్రాణహాని ఉంది దౌర్జన్యంగా పామాయిల్ గెలలు కోసుకుపోతున్నారు నా ఆస్తి నేను పొందకుండా ముత్య మాధురి, సాల్మన్ రాజు‌అడ్డుపడుతున్నారు అందుకే పక్క పొలానికి చెందిన మల్లిడి శ్రీనివాసరెడ్డి కూలీలపై కేకలు వేసుంటారు మీడియాతో పామాయిల్ తోట యజమాని నురుకుర్తి వీరలక్ష్మి విశ్వం వాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం రంగంపేట మండలం ఈలగోలను గ్రామంలోని పామాయిల్ తోటలు తన సొంత ఆస్తి అని,వాటిపై నురుకుర్తి సాల్మన్ రాజుకు,ముత్య మాధురికి ఎలాంటి హక్కు లేదని తోట యజమాని నురుకుర్తి వీరలక్ష్మి చెప్పారు ఆమె తన తండ్రి టి.వి.వి.సత్యనారాయణతో కలిసి రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు.నురుకుర్తి సాల్మన్ రాజుతో...

బిడ్డలే శత్రువులైతే ఏంచేస్తాం

-పెద్ద కొడుకు చేసే రాద్ధాంతం అంతాఇంతా కాదయ్యా -వారికి ఆస్తులే కావాలి తప్ప మా బాగోగులు అక్కర్లేదు -న్యాయం చేయాలనీ వృద్ధ తల్లిదండ్రుల ఆవేదన -స్పందనలో పిర్యాదు చేయడానికి సమాయత్తం విశ్వం వాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం తల్లిదండ్రులు వద్దు వారి సంపాదించిన ఆస్తి పాస్తులే మాకు ముద్దు అంటూ.. కన్నతల్లిదండ్రులను రోడ్డున పడేసిన ఉదంతం స్థానిక సీతంపేటలో చోటుచేసుకుంది.ఈ సందర్భంగా జుత్తుగ అప్పన్న, జుత్తుగ సత్యవతి మీడియాను ఆశ్రయించి, మాట్లాడుతూ మాకు ఇద్దరు కుమారులు ముగ్గురు కుమార్తెలు సంతానం ఉన్నారని, వారందరికీ వివాహాలు, ఇత్యాది శుభకార్యాలు కూడా పూర్తిచేశామని తెలిపారు. నేను 2006వ సంవత్సరం లో సీతంపేటలో 72 గజాల స్థలాన్ని సుమారు రూ.5లక్షలకు కొనుగోలు చేసి, 2010 సమయంలో జి+టు భవంతిని నిర్మించామని వారు తెలిపారు పెద్దకొడుకు జుత్తుగ...

భూమి మీద పుట్టిన ప్రతివ్యక్తి స్వేచ్ఛగా బతకాలి

ఆ దిశగా మానవహక్కుల రక్షణకు కృషి మానవహక్కులకు భంగం కలిగినా అక్కడ మేం ఉంటాం హ్యూమన్ రైట్స్ పేరుతో ఎవరు బ్లాక్ మెయిల్ చేస్తే సహించేది లేదు అవగాహన సదస్సులు పెట్టి,ఉచిత న్యాయ సహాయం అందిస్తున్నాం బాధితులకు అండగా నిలుస్తున్న డాక్టర్ ఖండవల్లి లక్ష్మిని జాతీయ అవార్డుతో సత్కారించాం హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ చైర్మన్ తాళ్ళూరి ప్రసన్న కుమార్ విశ్వం వాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి స్వేచ్ఛగా బతకాలన్నదే తమ ఉద్దేశ్యమని అందుకోసమే తమ సంస్థ గడిచిన 9 ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు చిత్తశుద్ధితో కృషి చేస్తోందని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ చైర్మన్ తాళ్ళూరి ప్రసన్న కుమార్ చెప్పారు.అన్ని ప్రాంతాల్లో అవగాహన...

మానవత సంస్థ మెగా ప్లాంటేషన్ డ్రైవ్

- ఎస్ కె వి టి డిగ్రీ కాలేజీలో 90మొక్కలు నాటీన వైనం. - పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి. - ప్రకృతి బాగుంటేనే మనిషితో సహా జీవరాశుల న్నీ బాగుంటాయి. విశ్వం వాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం స్థానిక ఎస్ కె వి టి డిగ్రీ కాలేజీ ఆవరణలో మానవత సంస్థ ఆధ్వర్యాన మంగళవారం పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈసందర్బంగా పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మన్ తాడేపల్లి మోహన్ రావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం అవసరమన్నారు. ఈవిషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలన్నారు. ప్రపంచంలో మానవుడు జీవించాలంటే ప్రకృతి సహకరించాలని, కానీ ఓజోన్ పొర దెబ్బతిని నేలతల్లి బాధపడుతోందని, తద్వారానే మనందరం ఎంతో ఇబ్బందికి గురవుతున్నామని అన్నారు. ప్లాస్టిక్ మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తోందన్నారు....

ఫోటో జర్నలిస్ట్ లకు పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ప్రతిష్టత్మక పురస్కరాలు

విశ్వం వాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం 19వ తేది వరల్డ్ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజమహేంద్రవరానికి చెందిన సీనియర్ ఫోటో జర్నలిస్ట్ లకు పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ గోదావరి బెస్ట్ ఫోటో జర్నలిస్ట్ అవార్డు 2025 లను అందించనున్నట్లు సంస్థ అధ్యక్షుడు అద్దంకి రాజా యోనా తెలిపారు. ఇద్దరు సీనియర్ ఫోటో జర్నలిస్ట్ లు జి.వి.వి. ప్రసాద్ (సాక్షి), ఎస్.బి.రాజేశ్వరరావు(ఆంధ్ర జ్యోతి) లను ఎంపిక చేశామని, మంగళవారం ప్రముఖులచే విశిష్ట పురస్కారాలను అందించనున్నామని తెలిపారు. క్లిష్టమైన సామాజిక, పర్యావరణ, సాంసృతిక మరియు ప్రజా సమస్యలను ఎత్తిచూపడం ద్వారా సమాజంలో మార్పును తేవడానికి కృషి చేస్తున్నాందుకు ఈ పురస్కారాలను అందిస్తున్నామని అద్దంకి రాజా యోనా తెలిపారు.
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo