విశ్వం వాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం రూరల్
రాజమహేంద్రవరం రూరల్ మండలం రాజవోలు గ్రామానికి చెందిన లొల్ల సత్యనారాయణ ప్రసాద్ శ్రీమతి ఈశ్వరి కుమారుడు వెంకట సత్య శ్రీకాంత్ USA,కోడలు దేవి కనక మహాలక్ష్మి, మనవడు అధ్వీక్ కార్తీకేయ తరపున సుమారు తొంబై వేల రుపాయల (90,000) విలువగల బంగారు మంగళ సూత్రాలు రాజవోలు గ్రామ దేవత పోలేరమ్మ అమ్మవారికి బహుకరించారు.
ఆలయ ధర్మకర్త శ్రీ కోనేరు మృత్యుంజయరావు( బుజ్జి అన్నయ్య ) చేతులమీదుగా ఆలయ అర్చకులు శ్రీ సాయి పోలేరమ్మ అమ్మవారికి అలంకరించడం జరిగింది.