వ్యభిచారం చేయమని ఒత్తిడి.. నిరాకరించిందని ప్రియుడు చాకుతో పొడిచి హత్య
విశ్వం వాయిస్ న్యూస్, రాజోలు
రాజోలు మండలం బి.సావరం గ్రామం సిద్ధార్థనగర్ లో ఓ వివాహిత యువతిని ఆమె ప్రియుడు దారుణంగా హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది.
స్థానికంగా నివాసముంటున్న ఓలేటి పుష్ప (22) గతంలో వివాహం చేసుకుని విడాకులు తీసుకుంది. అనంతరం షేక్ షమ్మ (22) అనే యువకుడితో కలిసి గత ఆరు మాసాలుగా బి.సావరం గ్రామంలో అద్దె ఇంట్లో సహజీవనం చేస్తోంది.
షమ్మ గత కొన్ని రోజులుగా మద్యంతాగి పుష్పను వ్యభిచారం చేయాలని గొడవపడుతూ ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో "నా వెంట రావాలి" అంటూ మరోసారి అదే విషయంపై వాదన చోటుచేసుకుంది. పుష్ప నిరాకరించడంతో...