కుల వృత్తులు కేవలం ఆర్ధిక వనరులు మాత్రమే కాదు,మన సంస్కృతికి మూలం
ప్రోత్సాహం లేక ఇతర ప్రాంతాలకు వలస పోతున్న పరిస్థితులను అధిగమించేలా ప్రభుత్వాలు సహకరించాలి.
ఆవేదన వ్యక్త పరిచిన ఎం.బి.సి సంఘ అద్యక్షులు యాట్ల నాగేశ్వరరావు
రామచంద్రపురం నియోజకవర్గం
కులవృత్తి కి దక్కాల్సిన గౌరవం సమాజంలో కరువవుతోందని, బ్రాండెడ్ వస్తువులు బిజినెస్ విస్తరణతో సంప్రదాయ సేవా కులవృత్తులు,చేతి పనులు కనుమరుగవుతున్నాయని, రామచంద్రపురం నియోజకవర్గ ఎం.బి.సి సంఘం అధ్యక్షులు యాట్ల నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.కులవృత్తుల పట్ల చిన్నచూపు తో,సంస్కృతి పై గౌరవం, కళాకారుల నైపుణ్యం మసకబారిపోయి, మరుగున పడిపోతాయన్నారు. ఒక సమాజం శాశ్వతంగా నిలబడాలంటే మూలాదారాలు ముఖ్యమని, విలువలు,కులవృత్తులు భారత దేశ గ్రామీణ నిర్మాణంలో కలిసిపోయిన జీవన తంత్రమన్నారు, ప్రతీ కులానికి ఒక వృత్తి, ప్రతీ...