రాష్ట్రంలో బహుళ అంతస్తుల భవనాలకు 72 గంటల్లో పర్మిషన్ !
విశ్వం వాయిస్ స్పెషల్ రిపోర్ట్ టీం, విజయవాడ
ఆంధ్రప్రదేశ్‌లో భవన నిర్మాణాల అనుమతుల్ని ప్రభుత్వం తేలిక చేస్తోంది. ఇప్పటికే ఐదు అంతస్తుల వరకూ సెల్ఫ్ డిక్లరేషన్ తో ఆన్ లైన్ లోనే అనుమతులు తీసుకునే అవకాశం కల్పించింది. ఇప్పుడు బహుళ అంతస్తుల నిర్మాణాల అనుమతుల్ని కూడా సులభతరం చేస్తోంది. పట్టణాభివృద్ధిని వేగవంతం చేయడానికి , “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్”ను ప్రోత్సహించడానికి బహుళ అంతస్తుల భవనాలకు 72 గంటల్లో అనుమతులు ఇవ్వడానికి కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ను ప్రవేశపెట్టింది. ఈ విధానం 12 అంతస్తులు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న భవనాల నిర్మాణ అనుమతులను 72 గంటల్లో జారీ చేయడానికి ఉపయోగపడుతుంది....