రాష్ట్రంలో వాహనాలకు గ్రీన్ టాక్స్ తగ్గించిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన శంఖవరం కూటమి నాయకులు
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ చిత్ర పటాలకు క్షీరాభిషేకం
* ప్రత్తిపాడు ఎమ్మెల్యే సత్యప్రభకు ఘన పౌర సన్మానం
* వాహన యజమానుల సమస్యను పరిష్కరిస్తా ఎమ్మెల్యే
విశ్వం వాయిస్ స్పెషల్ రిపోర్ట్ టీం, కాకినాడ
ది కత్తిపూడి మోటర్ లారీ ఓనర్స్ ఆపరేటర్స్ యూనియన్ సభ్యుల జీవనభృతి, లారీ రవాణా వ్యాపార సంబంధ సమస్యలను పరిష్కరిస్తానని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ హామీ ఇచ్చారు. నిజానికి ఈ యూనియన్ కార్యకలాపాలు, వ్యాపారం విషయాలపై నాకు అంతగా పరిజ్ఞానం లేదు. ఐనప్పటికీ తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆమె మాట ఇచ్చారు. లారీలు వగైరా తదితర వాహనాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రోడ్డు రవాణాశాఖ సాలీనా విధించే గ్రీన్ టాక్సును గణనీయంగా తగ్గిస్తామని 2024 సార్వత్రిక...