Saturday, August 2, 2025
Saturday, August 2, 2025
టెలిగ్రామ్
తాజా అప్డేట్స్ కోసం — మన టెలిగ్రామ్ చానల్‌లో చేరండి
చేరండి

రిపోర్టర్ : అంబోజి రామ్

స్పందించిన పోలీసులు – గుంత వద్ద బారికేడ్లు ఏర్పాటు 

రోడ్డుపై ఏర్పడిన గుంత వద్ద బారికేడ్లు ఏర్పాటు - స్పందించిన ఎటపాక ఎస్సై జి.అప్పలరాజు - ఎస్సైను అభినందించిన స్థానికులు , వాహనదారులు విశ్వం వాయిస్ న్యూస్, ఎటపాక నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే భద్రాచలం నుండి చర్ల వెళ్లే ప్రధాన అంతర్రాష్ట్ర రహదారిపై ఎటపాక పోలీస్ స్టేషన్ సమీపంలో పెద్ద గుంత ఏర్పడి ప్రమాదకరంగా మారింది. దాంతో మీడియా ద్వారా సమాచారం తెలుసుకున్న ఎటపాక ఎస్సై జి.అప్పలరాజు రాత్రిపూట అయినా కూడా తమ సిబ్బందితో కలిసి రహదారి మధ్యలో ఉన్న గుంతలో కర్రను ఉంచి ఇరువైపులా సిమెంట్ బస్తాలు వేసి బారికేడ్లు ఏర్పాటు చేశారు. దాంతో ప్రస్తుతానికి తాత్కాలిక ఉపశమనం లభించిందని , రాత్రిపూట ప్రయాణించే వాహనదారులకు ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా స్పందించిన ఎటపాక...

ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ పేరుతో తనిఖీలు

ఎటపాక మండలంలో ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ తనిఖీలు నిర్వహించిన సీఐ ఎం కన్నపరాజు , ఎస్సై అప్పలరాజు స్కూల్స్ పరిసర ప్రాంతాల్లో పొగాకు ఉత్పత్తులు, గంజాయి అమ్మితే కఠిన చర్యలు విశ్వం వాయిస్ న్యూస్, ఎటపాక ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ లో భాగంగా ఎటపాక పోలీసులు గురువారం నెల్లిపాక , నల్లకుంట హై స్కూల్ , ప్రైమరీ స్కూల్ పరిసర ప్రాంతాల్లో 100 అడుగుల దూరంలో ఉన్న పాన్ షాపులలో , కిరాణా దుకాణాలలో ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు ఎటపాక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం.కన్నపరాజు నేతృత్వంలో ఎస్సై జి.అప్పలరాజు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది విద్యా సంస్థలకు దగ్గరలో సిగరెట్లు , ఇతర పొగాకు ఉత్పత్తులు...

వాహనదారులు…! ఆదమరిస్తే ఇక అంతే.

ఆదమరిస్తే ఇక అంతే.. వాహనదారులు జరభద్రం...! రోడ్డుపై గుంతను వెంటనే పూడ్చాలి. అధికారులు సకాలంలో స్పందించాలని కోరుతున్న వాహనదారులు. విశ్వం వాయిస్ న్యూస్, ఎటపాక ఎటపాక మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ నుండి ప్రభుత్వ కార్యాలయాలు , ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్లే దారి మధ్యలో భద్రాచలం నుండి చర్ల వెళ్లే ప్రధాన రహదారిపై పెద్ద గుంత ఏర్పడింది. దాంతో రోడ్డు మీదుగా ప్రయాణిస్తున్న వాహనదారులు తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం పొంచి ఉంది. నిత్యం తెలంగాణ ప్రాంతమైన చర్ల నుండి వస్తున్న ఇసుక లారీలతో రోడ్డు దెబ్బతింది. దాంతో కన్నాయిగూడెం నుండి ఎటపాక వరకు గల రహదారి గుంతల మయంగా మారి ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే భయం వాహనదారులలో వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో...

యాచకుని పట్ల మానవత్వం చూపిన యువకుడు వినయ్

మానవత్వం చాటిన నెల్లిపాక యువకుడు వినయ్ - వినయ్ ను అభినందించిన స్థానికులు , అధికారులు విశ్వం వాయిస్ న్యూస్, ఎటపాక గుర్తు తెలియని వాహనం ఢీకొని గాయపడిన యాచకుని పట్ల మండల పరిధిలోని నెల్లిపాక గ్రామానికి చెందిన యువకుడు ముదిగొండ వినయ్ మానవత్వం చాటుకున్నారు. నెల్లిపాక గ్రామ సమీపంలో ప్రమాదానికి గురై జాతీయ రహదారి పక్కన పడి ఉన్న యాచకున్ని యువకుడు వినయ్ గుర్తించి ఫస్ట్ ఎయిడ్ చేసి , ఆకలితో ఉన్న తనకు భోజనం ఏర్పాటు చేశారు. చిరిగిన వస్త్రాలతో ఉన్న యాచకునికి వస్త్రాలు అందించగా స్థానికులు యువకుడు వినయ్ ను ప్రత్యేకంగా అభినందించారు. స్థానికంగా ఎవరికి ఏ ఆపద సంభవించినా , రోడ్డు ప్రమాదాల్లో గాయపడినా , మరణించినా నేనున్నానంటూ తన...

కార్మిక హక్కులు కాపాడాలి – లేబర్ కోడ్ లు రద్దు చేయాలి

సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ విశ్వం వాయిస్ న్యూస్, ఎటపాక పది గంటల పని విధానాన్ని ఉపసంహరించుకోవాలనీ , ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలి. స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలి. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి. అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. రవాణా రంగ కార్మికుల పట్ల శాపంగా మారిన బిఎన్ఎస్ చట్టాన్ని రద్దు చేయాలి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి. నిర్మాణ రంగ కార్మికుల సమ్మె చట్టం 1996ను వలస కార్మికుల సంక్షేమ చట్టం 1970 నీ పటిష్టంగా అమలు చేయాలి. ఎల్ఐసి పాలసీపై జిఎస్టి ని రద్దు చేయాలి , ఎల్ఐసి ఏజెంట్లకు...
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo