లయన్స్ క్లబ్ చే 932 వ రోజు అభాగ్యులకు అన్నదానం
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, తాళ్లరేవు
కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలంలోని తాళ్ళరేవు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం అభాగ్యులకు అన్నదానం కార్యక్రమం ద్వారా భోజనాలు అందజేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు తాళ్ళరేవు రీజియన్ చైర్ పర్సన్ బిళ్ళకుర్తి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ శనివారం నాటికి 932 రోజులునుండి నిరంతరాయంగా అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. అనంతరం దాతలు ఏర్పాటుచేసిన భోజనాలను మండలంలోని పలువురు అభాగ్యులకు అందజేశారు. చాలా రోజులుగా లయన్స్ క్లబ్ చేస్తున్న ఈ సేవలను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో దాతలు మరియు లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.