లాభాల బాటలో కత్తిపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, శంఖవరం
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడిలోని ది కత్తిపూడి కర్షక సేవా ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం గత రెండేళ్లుగా లాభాల్లోనే ఉందని తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఒకింత సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాలకు పాలక వర్గాలుగా త్రీ మెన్ కమిటీలను నియమించింది. దీంతో కత్తిపూడి ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడుగా రిటైర్డు ఆర్టీసీ డ్రైవర్ గాబు కృష్ణమూర్తి, సభ్యులు (పర్సన్ ఇంచార్జీలు)గా నియమితులైన శరణం జయబాబు, పట్టెం సత్తిబాబు నియమితులు అయ్యారు. వీరు సంఘం...