విశ్వం వాయిస్ న్యూస్, చాగల్లు
తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం మల్లవరం గ్రామంలో వరిలో ఆరుతడి పద్ధతి గురించి, ఉపయోగం గురించి రైతులతో ట్రైనింగ్ నిర్వహించారు. ఈ ట్రైనింగ్ లో జిల్లా అదనపు ప్రాజెక్టు మేనేజర్ వలి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ విధి విధానాలు మరియు వాతావరణం లో వచ్చే మార్పులు గురించి చెప్పారు. అలాగే వరి పొలంలో ఆరుతడి అనేది చాలా మంచిదని దానివల్ల రైతుకు మంచి జరుగుతుందని అదేవిధంగా నీటి ఆదా విద్యుత్ శక్తి ఆదా పురుగులు తెగులు తక్కువ ఆశించుతాయి మంచి పంటను తీయొచ్చు అని అన్నారు. అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్ వేణు మాట్లాడుతూ ప్రతి రైతు తనకు ఉన్న పొలంలో కొంత అయినా ప్రకృతి వ్యవసాయం చేయాలని...