విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు
గౌరీ దేవిని పసుపు కొమ్ములతో పూజించిన స్త్రీలకు సంతాన యోగము కలిగి నిండు సౌభాగ్యములు, సిరిసంపదలు కలుగుతాయని శాస్త్రాలు ఘోషిస్తున్నాయని వేద పండితులు చల్ల శ్రీకాంత్ అన్నారు. బుధవారం కొవ్వూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణమండపం నందు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి నందు లక్ష పసుపు కొమ్ముల వ్రత మహోత్సవాన్ని మహిళలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేద పండితులు చల్లా శ్రీకాంత్ పర్యవేక్షణలో జరిగిన పసుపు కొమ్ముల నోము కార్యక్రమంలో 108 మంది మహిళలు గౌరీదేవి అమ్మవారిని పసుపు కొమ్ములతో పూజించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొవ్వూరు మున్సిపల్ కమిషనర్ గ్రంధి సందీప్ కుమార్ ఎంఈఓ రామకిషోర్ ఆర్యవైశ్య సంఘ పెద్దలు ముద్దుల సత్యనారాయణ మద్దుల సోమరాజు...