విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు
స్త్రీ శక్తి పథకం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వలన జీవనోపాధి కోల్పోతున్న ఆటో కార్మికులకు భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 ప్రకారం జీవన భద్రత, జీవనోపాధి కల్పించాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు హైకోర్టు న్యాయవాది నంబూరి శ్రీమన్నారాయణ అన్నారు. గురువారం కొవ్వూరు పట్టణం లో ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం ఐఎఫ్టియు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని హామీలను తక్షణమే అమలు చేయాలని కోరుతూ ఆటో కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగానంబూరి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు ఈఎస్ఐ, పిఎఫ్, పెన్షన్ పథకాలు తో కూడిన ఆటో సంక్షేమ బోర్డును తక్షణమే ఏర్పాటు చేసి ఆటో కార్మికులకు న్యాయం చేయాలని...