ఆర్.వి.ఎన్. సదస్సు లో వక్తలు
వ్యవసాయం, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు తోడ్పాటుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
కాకినాడ సిటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన విజన్ - 2047 డాక్యుమెంట్ కార్పోరేట్ల ప్రయోజనం కోసమే తయారు చేయబడిందని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ డా. బి. గంగారావు తెలిపారు.
శనివారం సాయంత్రం కాకినాడ యుటిఎఫ్ హోం లో రఘుపతి వెంకటరత్నం నాయుడు స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో "విజన్ 2047 - ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి" అనే అంశంపై సదస్సు నిర్వహించారు.
పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. సత్తిరాజు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో గంగారావు ముఖ్యవక్తగా ప్రసంగించారు. 229 పేజీలు గల ఎపి విజన్ డాక్యుమెంట్, కేంద్ర బిజెపి వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా...