విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
జగ్గంపేటలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాల నూతన ప్రిన్సిపాల్‌గా శనివారం జీవి లలిత కుమారి బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆమె రాజమండ్రిలోని గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా సేవలందించిన అనుభవం ఉంది.ఇప్పటివరకు ఈ పాఠశాలలో ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్‌గా పనిచేసిన రాజకుమారి చొల్లంగి బదిలీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రిన్సిపాల్ లలిత కుమారి మాట్లాడుతూ విద్యార్థులను అభ్యున్నత మార్గంలో తీర్చిదిద్దేందుకు నా వంతు కృషి చేస్తాను. వసతి గృహంలో ఉండే విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారాన్ని అందించడమే కాకుండా, వారి ఆరోగ్యాన్ని కూడా ప్రతిరోజూ పర్యవేక్షిస్తాను అని తెలిపారు.ఆమెను పాఠశాల ఉపాధ్యాయులు పూల గుచ్చంతో ఆత్మీయంగా స్వాగతం పలికారు. విద్య, శిక్షణల విషయంలో పాఠశాల మరింత ముందుకు సాగుతుందని సిబ్బంది ఆశాభావం వ్యక్తం చేశారు.
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
జగ్గంపేటకు చెందిన పేద విద్యార్థి కణితి సోమ శేఖర్ ఇటీవల నిర్వహించిన ఎ యూ సెట్ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో 14వ ర్యాంకు సాధించాడు. అతని ప్రతిభను గుర్తించి, శ్రీ కరుటూరి చారిటబుల్ ట్రస్ట్ తరపున రూ.10,000/- ను విద్యా ప్రోత్సాహకంగా అందజేశారు.ఈ సహాయాన్ని తోట నరసింహం, తోట రాంజీ, ఒమ్మి రఘురాం,ట్రస్ట్ చైర్మన్ కరుటూరి శ్రీనివాస్ చేతుల మీదుగా సోమ శేఖర్‌కు అందజేశారు.ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ, “పేద విద్యార్థుల శిక్షణకు, విద్యాభివృద్ధికి ఎల్లప్పుడూ మా ట్రస్ట్ అండగా ఉంటుంది” అని తెలిపారు.
బూరుగుపూడి గ్రామంలో సామాజిక కార్యకర్త పాటంశెట్టి సూర్యచంద్ర చైతన్య యాత్ర
జగ్గంపేట
నేటి బాలలే రేపటి పౌరులు అనే దృష్టితో గ్రామస్థాయిలో విద్యపై అవగాహన పెంపొందించేందుకు సామాజిక ఉద్యమకారుడు పాటంశెట్టి సూర్యచంద్ర ప్రత్యేక చైతన్య యాత్ర చేపట్టారు. బూరుగుపూడి గ్రామంలోని పాఠశాల విడిచి ఉన్న విద్యార్థుల ఇళ్లకు స్వయంగా వెళ్లి, తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు విద్య యొక్క ప్రాముఖ్యతను వివరించారు. విద్య ద్వారా వారిలో వ్యక్తిత్వ వికాసం చేకూరుతుందని, మంచి పౌరులుగా ఎదగగలరని చెప్పారు.ప్రతి గ్రామంలోను బడికి వెళ్ళని పిల్లలను గుర్తించి, వారి తల్లిదండ్రులతో మాట్లాడి విద్యపై చైతన్యం కలిగించాల్సిన అవసరం ఉందని, ఈ పని రాజకీయాలకు అతీతంగా కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదేనని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు మాధవి,...