విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు,చాగల్లు
చాగల్లు మండలం ఉనగట్ల గ్రామ విశాల సహకార పరిమితి సంఘం చైర్మన్గా ఎన్నికైన బొల్లిన నాగేంద్ర కుమార్ ను కొవ్వూరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరపట్ల కళాధర్ చక్రవర్తి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు మున్సిపల్ ఒకటో వార్డు కౌన్సిలర్ బొండాడ సత్యనారాయణ, 14 వ వార్డు ఇంచార్జ్ వరాల ప్రతాప్ కుమార్, నాలుగో వాటి ఇంచార్జ్ బొంత కిషోర్, టిడిపి నాయకులు చాపల విజయ్ కుమార్ చంద్రశేఖర్ తదితరులు నాగేంద్రకు శుభాకాంక్షలు తెలిపారు.