స్థానిక ప్రకాశం నగర్ రౌండ్ పార్క్ దగ్గర ధర్మంచర హాలుపైన బుక్ బ్యాంకులో మంగళవారం ఉదయం సమావేశం..
విశ్వం వాయిస్ న్యూస్, రాజమండ్రి
డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కలిసినా,మాట్లాడినా అదొక మరపురాని జ్ఞాపకంగా అందరికీ మిగిలిపోతుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ అన్నారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ని పాలించిన సీఎం లలో డాక్టర్ వైఎస్ ని ఎవరూ మర్చిపోలేరని, హ్యూమన్ టచ్ గల సీఎం డా వైఎస్ అని ఆయన అన్నారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి జయంతి సందర్బంగా స్థానిక ప్రకాశం నగర్ రౌండ్ పార్క్ దగ్గర ధర్మంచర హాలుపైన బుక్ బ్యాంకులో మంగళవారం ఉదయం సమావేశం నిర్వహించారు. డా వైఎస్ చిత్రపటానికి భక్త్యంజలి ఘటించారు.
ఈసందర్బంగా ఉండవల్లి మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ తో గల అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ చాలామందికి డాక్టర్ వైఎస్ తో మరిచిపోలేని అనుబంధం ఉందన్నారు. అంతటి బలమైన ముద్ర అందరి మనస్సులో డాక్టర్ వైఎస్ వేసుకున్నారన్నారు....