కాకినాడ జిల్లా ఎస్పీ అభినందనలు
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
జగ్గంపేట పోలీసులు మెగా జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా నిర్వహించారు. ఈనెల 5వ తేదీ శనివారం జరిగిన లోక్ అదాలత్ ద్వారా జగ్గంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 116 కేసులు, అలాగే గండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మరో 116 కేసులు పరిష్కారమయ్యాయి.ఈ కార్యక్రమంలో కక్షిదారులు, ఫిర్యాదుదారులు, ఇరు వర్గాల మధ్య సఖ్యతను కలిగిస్తూ, వారితో నేరుగా మాట్లాడి సమస్యల పరిష్కారానికి సీఐ వై ఆర్ కె శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. ఆయన చొరవతో కాకినాడ జిల్లాలో జగ్గంపేట, గండేపల్లి స్టేషన్లు అత్యధిక కేసులు పరిష్కరించిన స్టేషన్లుగా నిలిచాయి.ఈ సందర్భంగా జగ్గంపేట సీఐ వై ఆర్ కె శ్రీనివాస్‌ను...
జగ్గంపేటలో 116 కేసులు పరిష్కారం — లోక్అదాలత్‌లో విశేష ఫలితాలు
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
కాకినాడ జిల్లా జగ్గంపేట పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్సై టి. రఘునాథరావు నిర్వహించిన కృషికి గుర్తింపు లభించింది.ఈనెల 5వ తేదీన నిర్వహించిన మెగా జాతీయ లోక్అదాలత్‌లో మొత్తం 116 కేసుల పరిష్కారానికి రఘునాథరావు ముఖ్య పాత్ర పోషించారు.కక్షిదారులు, ఫిర్యాదుదారులు, ఇరు వర్గాల వ్యక్తులను పరస్పర సమన్వయంతో కలిపి, సమాధానమార్గాలను సూచిస్తూ వారిని న్యాయపరంగా ఒప్పించి, కేసుల పరిష్కారానికి సహకరించడం ద్వారా జగ్గంపేట పోలీస్ స్టేషన్‌కు జిల్లాలో ప్రథమ స్థానం తెచ్చిపెట్టారు.ఈ ఘనతకు గుర్తింపుగా, శుక్రవారం (జూలై 25న) కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో, జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఐపీఎస్ ఎస్సై...
జగ్గంపేట
స్థానిక గోకవరం రోడ్డులోని మోడ్రన్ డిగ్రీ కళాశాలలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్, వికాస ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ముందుగా కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతులనవీన్ హాజరై వచ్చిన అభ్యర్థుల అందర్నీ పేరుపేరునా పలకరించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన సభలో వికాస పీడీ లక్ష్మణరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో జగ్గంపేట నియోజకవర్గం నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని 33 బ్రాండెడ్ కంపెనీలతో నిర్వహించిన ఈ మెగా జాబ్ మేళాకు 1206 అభ్యర్థుల హాజరై ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. దాదాపు 729 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని తెలియజేశారు. జ్యోతుల నవీన్ మాట్లాడుతూ నియోజవర్గంలో...
జగ్గంపేట
కాకినాడ జిల్లా జగ్గంపేటలోని గోకవరం రోడ్డులో ని మోడరన్ డిగ్రీ కళాశాల లో ప్రిన్సిపాల్ డాక్టర్ డి చెన్నారావు ఆధ్వర్యంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను ఘనంగా సత్కరించి జ్ఞాపిక బహుకరించారు.ఈ సందర్భంగా చెన్నారావు మాట్లాడుతూ కొండలతో, గుట్టలతో ఉన్న ఈ ప్రాంతాన్ని ఆహ్లాదకరమైన వాతావరణం గా తీర్చిదిద్ది మోడల్ డిగ్రీ కళాశాలను ఎమ్మెల్యే నెహ్రూ నిర్మించారని ఇప్పటికే గర్ల్స్ హాస్టల్ ఏర్పాటు చేయడం జరిగిందని బాయ్స్ హాస్టల్, కాంపౌండ్ వాల్ నిర్మించాలని ఎమ్మెల్యేని కోరారు. వారు ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో మాట్లాడి శాంక్షన్ చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, కొత్త కొండబాబు, మారిశెట్టి భద్రం, అడబాల భాస్కరరావు, జంపన సీతారామచంద్ర వర్మ,...
జగ్గంపేట
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలోని పీహెచ్సీ లో డాక్టర్ పోస్ట్లు ఖాళీగా ఉండటంతో గ్రామంలోని ప్రజలు వైద్యం కొరకు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గ్రామ టిడిపి అధ్యక్షులు ముసిరెడ్డి నాగేశ్వరరావు కాకినాడలోని జిల్లా వైద్యాధికారి డాక్టర్ జె. నరసింహ నాయక్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. మా కాట్రావులపల్లి గ్రామానికి తక్షణం వైద్య అధికారులను నియమించి పీహెచ్సీలో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులు భర్తీ చేయాలని డిఎంహెచ్వోను కోరినట్లు ముసిరెడ్డి నాగేశ్వరరావు తెలియశాజేశారు.తక్షణం స్పందించిన జిల్లా వైద్యాధికారి నరసింహ నాయక్ కాట్రావులపల్లి ఆసుపత్రికి ఒక లేడీ మెడికల్ ఆఫీసర్,ఒక జంట్ మెడికల్ ఆఫీసర్ ను నియమించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలియజేశారు..తక్షణం స్పందించి కాట్రావులపల్లి గ్రామానికి...