విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
2025 మెగా డీ ఎస్ ఈ లో జగ్గంపేట మండలం జె. కొత్తూరు గ్రామానికి చెందిన నిడమర్తి రాజ్ కుమార్ తండ్రి ఇశ్రాయేలు అనే యువకునికి ఎస్ జి టి గా అవకాశం దక్కడంతో పలువురు అభినందించారు.జె. కొత్తూరు గ్రామానికి చెందిన దళిత సామాన్య కుటుంబానికి చెందిన ఈ యువకుడు ఎంతో కష్టపడి తన విజయంతో ఇటు కుటుంబానికి, అటు జె.కొత్తూరు గ్రామానికి ఎనలేని గౌరవాన్ని తెచ్చాడన్నారు.గ్రామంలో ఎస్సీ సామజిక వర్గం నుండి మొట్ట మొదటిగా ఉపాధ్యాయ ఉద్యోగం సాధించిన ఘనత సాధించాడన్నారు. ఈ సందర్భంగా నిడమర్తి రాజ్ కుమార్ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వానికి, జ్యోతుల ఫౌండేషన్ వార్కి, ఇందుకు సహకరించిన అందరికీ ముఖ్యంగా జె. కొత్తూరు...
గండేపల్లి తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇంచార్జ్ జాస్తి వసంత్ఆర్థిక సాయంతో అన్న క్యాంటీన్ ఏర్పాటు
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక కాకినాడ రోడ్ లోని ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత నాలుగు సంవత్సరాలుగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ కు సోమవారం గండేపల్లి క్లస్టర్ ఇంచార్జ్, మురారి గ్రామ ఉపసర్పంచ్ జాస్తి వసంత్ ఆర్థిక సహాయంతో పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర టిడిపి కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు ముఖ్యఅతిథిగా హాజరై పేదలకు అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా ఎస్వీఎస్ మాట్లాడుతూ గండేపల్లి క్లస్టర్ ఇంచార్జ్ జాస్తి వసంత్ ఆర్థిక సాయంతో...
టీచర్ ఉద్యోగాలు సాధించిన 23 మందికి అభినందన సత్కార కార్యక్రమం
ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్, జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ చైర్మన్ జ్యోతుల మణి
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా నిర్వహించిన ఉచిత టెట్ డీఎస్సీ కోచింగ్ లో 23 మంది ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించడంతో వారికి జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అభినందన సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్, జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్, జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ చైర్మన్ జ్యోతుల...
ప్రభుత్వం ద్వారా పి ఫోర్, ఆదరణ పథకంలో స్వయం ఉపాధికి అవకాశం కల్పిస్తా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక రావులమ్మ నగర్ లోని టిడిపి కార్యాలయంలో జగ్గంపేట జ్యోతుల నెహ్రూ కాంప్లెక్స్24మంది చిరు వ్యాపారస్తులందరూ కలిసి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూను, జిల్లా టిడిపి అధ్యక్షులు జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ ను ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా షాపింగ్ కాంప్లెక్స్ సభ్యులు ఆశీర్వాద్ రియల్ ఎస్టేట్ కింతాడ రాజు మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిరు వ్యాపారస్తులకు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ లు షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు...
నిందితులను కఠినంగా శిక్షించాలి
మరోతి శివ గణేష్
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం, గోకవరం గ్రామం,బంగాళా పేటకు చెందిన దళిత మైనర్ బాలిక పావని పై ఈనెల 8వ తారీఖున ఇద్దరు యువకులు అత్యాచారం చేసిన దుర్ఘటనకు సంబంధించి బాధితురాలని వారి స్వగృహం నందు జగ్గంపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మరోతి శివ గణేష్ పరామర్శించి, బాధితురాలికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా మరోతి శివ గణేష్ మీడియాతో మాట్లాడుతూ పోక్సో చట్టం ప్రకారం స్థానిక తాసిల్దార్ బాధితురాలని సందర్శించవలసిన అవసరం ఉందని, బాధితురాలికి చాటరీత్యా ఆర్థిక సహకారంనకు సంబంధించిన తగు న్యాయ చర్యలు తీసుకోవాలని,కానీ బాధితురాలను సందర్శించక పోవడం చట్ట విరుద్ధమని...
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను రైతులు విధిగా వేయించాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. గోకవరం మండలం కృష్ణుని పాలెం గోపికృష్ణ ఫంక్షన్ హాల్ ఆవరణలో గోకవరం పశు వైద్యశాల వైద్యులు డాక్టర్ లోకేష్ ఆధ్వర్యంలో జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకం, గాలికుంటు వ్యాధి నిరోధిక టీకాలు కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హాజరై పోస్టల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఈనెల 15వ తేదీ నుండి అక్టోబర్ 15వ తేదీ వరకు ఈ టీకాలనుప్రతి ఇంటింటికి వెళ్లి పశువులకు టీకాలను వేయడం జరుగుతుందని ఎమ్మెల్యే నెహ్రూ...
జగ్గంపేట మండల టిడిపి అధ్యక్షులు జీను మణిబాబు పరామర్శ
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
కాకినాడ జిల్లా జగ్గంపేట ఆంధ్రప్రభ సీనియర్ విలేకరి, ఏపీయూడబ్ల్యూజే నియోజకవర్గ అధ్యక్షులు అడపా వెంకట్రావు కొద్దికాలంగా అస్వస్థతకు గురై ఇంటి వద్ద వైద్యం పొందుతున్నారు. టిడిపి సీనియర్ నాయకులు, పార్టీ మండల అధ్యక్షులు అధ్యక్షులు జీను మణిబాబు గురువారం ఆయనను పరామర్శించారు. వెంకట్రావు కాలికి ఇన్ఫెక్షన్ వచ్చి మోకాలి వరకు వాచిపోయింది. స్థానిక ఆదిత్య హాస్పిటల్ డాక్టర్ ఎంఎస్ బాలగంగాధర్ ఎమ్మెస్ జూలై 26వ తేదీ నుండి వైద్యం అందించారు. సుమారు 45 రోజులుగా ఇంటి వద్ద ఉండి వైద్యం పొందుతున్నారు. విషయం తెలిసిన మణి బాబు స్థానిక నాయకులతో కలిసి వెంకటరావును పరామర్శించారు. త్వరగా కోలుకుని మంచి...
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
జగ్గంపేటలోని ఏఎంటీ ఫిజియోథెరపీ క్లినిక్ ఆధ్వర్యంలో సోమవారం ఫిజియోథెరపీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా జగ్గంపేట హెచ్ పి పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న ఏఎంటి ఫిజియోథెరపీ క్లినిక్ నందు ప్రముఖ ఫిజియోథెరపీ వైద్యులు డాక్టర్ శ్రీరామ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో వైద్యులు శ్రీరామ్ ఉచితంగా వైద్య సేవలు, సలహాలు, సూచనలు, మందులను అందజేశారు.ఈ సందర్భంగా ఫిజియోథెరపీ వైద్యులు శ్రీరామ్ మాట్లాడుతూ ఆధునిక జీవనశైలిలో మనిషి అనేక రుగ్మతలకు గురవుతున్నాడని, మనిషికి సరైన వ్యాయామం,నిద్ర, శారీరక శ్రమ లేకపోవడం వల్ల శరీరంలోని కండరాలు, నరాలు, ఎముకలకి సంబంధించిన వ్యాధుల గురవుతున్నారన్నారు.
ఈ వ్యాధుల నుంచి కోల్కొనేందుకు ఫిజియోథెరపీ చికిత్స కీలకపాత్ర...
గురుస్వామి రామకృష్ణ మనవరాలు గాయత్రి ఐశ్వర్య జన్మదిన సందర్భంగా నిర్వహణ
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
స్థానిక కాకినాడ రోడ్ లోని ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత నాలుగు సంవత్సరాలుగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ కు ఈ వారం జగ్గంపేట వాస్తవ్యులు ప్రముఖ పురోహితులు, గురు స్వామి మామిళ్ళపల్లి రామకృష్ణ, రాధాదేవి దంపతుల మనవరాలు గాయత్రి ఐశ్వర్య పుట్టినరోజు సందర్భంగా వారి తల్లి తండ్రులు,అర్చక,పురోహిత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిళ్లపల్లి అయ్యప్ప,మౌనికల ఆర్థిక సహాయంతో పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జగ్గంపేట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీనుమణిబాబు ముఖ్యఅతిథిగా హాజరై గాయత్రి ఐశ్వర్య...
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
జగ్గంపేట మండలం రాజపూడి అంగన్వాడి కేంద్రంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ జగ్గంపేట సీడీపీఓ ఎం. పూర్ణిమ ఆధ్వర్యంలో పోషకహర దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ భూసాల విష్ణుమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా సర్పంచ్ విష్ణు మారుతి మాట్లాడుతూ బిడ్డ గర్భంలో ఉన్నప్పటి నుండి తల్లితో అనుబంధం ఏర్పడుతుంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భ దశ నుంచి ఐదు సంవత్సరాల వయసు వరకూ పిల్లలకు అనేక సేవలు అందిస్తున్నాం. బాలింతలు, గర్భిణీలు అంగన్వాడీ కేంద్రాలలో అందిస్తున్న పోషకాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. చిరుధాన్యాలు, ఆకుకూరలు, మునగాకు వంటి వాటిని ఆహారంలో చేర్చుకోవాలి అని సూచించారు. అలాగే అంగన్వాడీ టీచర్లు తల్లులకు అవగాహన కల్పించే బాధ్యతను సమర్థంగా నిర్వర్తించాలని...