ముమ్మడివరం
శెట్టిబలిజ కులం సర్టిఫికెట్లు జీవో జారీ పట్ల హర్షం.- మంత్రి సుభాష్ కు శెట్టిబలిజలు కృతజ్ఞతలు
శెట్టిబలిజ కులస్తులకు శెట్టిబలిజ బీసీ బి సీరియల్ నెంబర్ -4 గా కులం సర్టిఫికెట్లు యధావిధిగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 6 ను జారీ చేయడం పట్ల ఆ సామాజిక వర్గం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బీసీ సీనియర్ నాయకులు,టిడిపి రాష్ట్ర కార్యదర్శి గుత్తుల వెంకట సాయి అధ్యక్షతన నాయకులు కాట్రేనికోనలో సమావేశమై జీవో జారీకి కృషి చేసిన రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు వాసంశెట్టి సుభాష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గుత్తుల సాయి మాట్లాడుతూ మంత్రి వాసంశెట్టి శుభాష్ సమస్యను సీఎం చంద్రబాబు నాయుడు...