మహిళా సాధికారతయే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది -ఎమ్మెల్యే ముప్పిడి
విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు
మహిళా సాధికారతయే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్త్రీ శక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంను శుక్రవారం కొవ్వూరు పట్టణంలోని బస్టాండ్ నందు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మహిళల అభివృద్ధి లక్ష్యంగా అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని ప్రారంభించి మహిళలకు రిజర్వేషన్లు కల్పించారన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘాలను ప్రవేశపెట్టి మహిళలకు ఆర్థిక భరోసాను కల్పించారన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు ఉచిత...