విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు
ఎందరో మహనీయుల త్యాగ ఫలాలతో వచ్చిన స్వతంత్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పశ్చిమగోదావరి జిల్లా మాజీ అధ్యక్షులు మహమ్మద్ రఫీ ఉల్లాహ్ అన్నారు. శుక్రవారం దొమ్మేరు గ్రామంలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద 79వ స్వాతంత్ర వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రఫీ మాట్లాడుతూ బ్రిటిష్ కాలంలో భారతీయులను అనేక ఇబ్బందులకు గురి చేశారని స్వతంత్రం వచ్చిన తర్వాత భారతీయులందరూ భిన్నత్వంలో ఏకత్వంగా జీవిస్తున్నారని అన్నారు. కుల మత పేదలు లేకుండా అందరూ సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని దానికి కారణం జాతిపిత మహాత్మా గాంధీ చలవే అని అన్నారు.ఈ కార్యక్రమానికి చాగల్లు మండల కాంగ్రెస్ అధ్యక్షులు మట్టా సుబ్బారావు ,...
కొవ్వూరు పట్టణంలోని విజయ విహార్ సెంటర్ నందు భారతీయ జనతా పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో 200 జాతీయ జెండాలను పంపిణీ
విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు
బ్రిటిష్ వారు భారతదేశ విడిచి వెళ్లడానికి ముందు రోజే రాజకీయ ప్రయోజనాల కొరకు భారతదేశాన్ని విభజించి, హిందువులను ఊచకోత కు గురిచేసిన సంఘటన ఎప్పటికీ మరిచిపోలేమని భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర అన్నారు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా లో భాగంగా గురువారం కొవ్వూరు పట్టణంలోని విజయ విహార్ సెంటర్ నందు భారతీయ జనతా పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో 200 జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పిక్కి...