భారతీయులుగా పుట్టినందుకు గర్వపడాలి - మునిసిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి
విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు
కులం ఏదైనా మతం ఏదైనా మనమంతా భారతీయులమని భారతీయుడిగా పుట్టినందుకు గర్వించాలని కొవ్వూరు మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి అన్నారు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుమేరకు బుధవారం కొవ్వూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నుండి ఆర్డీవో కార్యాలయం వరకు హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులు 100 మీటర్ల త్రివర్ణ పతాకాన్ని తీసుకుని వందేమాతరం భారత్ మాతాకు జై అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ భావన రత్నకుమారి మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల త్యాగాల ఫలితం మనం అనుభవిస్తున్న భారత దేశ స్వాతంత్రం అని అన్నారు....