సిడిపిఓ పూర్ణిమ
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
తల్లి పాలు ప్రతి శిశువు ఆరోగ్యానికి అత్యంత కీలకమని సిడిపిఓ ఎం. పూర్ణిమ పేర్కొన్నారు. మండల కేంద్రమైన జగ్గంపేట మరియు మన్యంవారిపాలెం గ్రామంలో శుక్రవారం తల్లిపాలు వారోత్సవాలు ఉత్సాహంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా గర్భిణీలకు, బాలింతలకు, వారి కుటుంబ సభ్యులకు తల్లి పాలను అందించడంలో ఉండే లాభాలపై అవగాహన కల్పించబడింది.ఈ కార్యక్రమంలో మాట్లాడిన సిడిపిఓ పూర్ణిమ మాట్లాడుతూ,తల్లి పాలు శిశువుకు రోగనిరోధక శక్తిని పెంచుతూ, ఇన్ఫెక్షన్లను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పాలు పీల్చడం ద్వారా తల్లిలో పాలు ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో తల్లి–బిడ్డ బంధం బలపడుతుంది. అంతేకాకుండా తల్లికి రక్తస్రావం తగ్గి, శరీర ధృఢత్వం పొందుతుంది” అని వివరించారు.ఈ వారోత్సవాల సందర్భంగా అంగన్వాడీ కేంద్రాలలో...
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
గండేపల్లి మండలం జెడ్ రాగంపేట ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, జిల్లా నీటి యాజమాన్య సంస్థ సంయుక్తంగా నిర్వహించిన పండ్ల మొక్క లు నాటే కార్యక్రమం కి జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్యఅతిథిగా హాజరై పండ్ల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు మాట్లాడుతూ నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద మొక్కలు నాటే మంచి కార్యక్రమం ఎనర్జీఎస్ చేపట్టడం వల్ల ఇక్కడకు వచ్చే రోగులకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు మంచి ఆక్సిజన్ అందుతుందని వారి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం...