విశ్వం వాయిస్ న్యూస్,
ఏపీలో ఇంకా వాయుగుండం ఎఫెక్ట్ కొనసాగుతోంది.
ఉత్తరాంధ్రలో మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
విశాఖలో ఈదురుగాలుల బీభత్సం కారణంగా చెట్లు కూలిపోవడం, విద్యుత్ సమస్యలు ఎదురవుతున్నాయి.
శ్రీకాకుళంలో వంశధార, నాగావళి నదులు ఉగ్రరూపం దాల్చాయి.
పలు తీరగ్రామాలు ముంపుబారాయి.
మొత్తం మీద ఉత్తరాంధ్రను వణికించిన తీవ్ర వాయుగుండం ఆందోళన కలిగిస్తోంది.