డిసెంబరు 26,27 తేదీల్లో గండికోట ఉత్సవాలు
సాస్కి పథకం కింద గండికోట పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సీఎం
రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు పర్యాటక ప్రాజెక్టులకు రూ.500 కోట్ల విలువైన ఒప్పందాలు
గండికోటలో ఏపీ టూరిజం ఇన్వెస్టర్స్ మీట్ కు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు
విశ్వం వాయిస్ న్యూస్, గండికోట
పర్యాటకంగా గండికోట అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. శుక్రవారం గండికోట వద్ద ఆంధ్రప్రదేశ్ టూరిజం ఇన్వెస్టర్స్ మీట్ కు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గండికోట ప్రాంతాన్ని యాంకర్ హబ్ గా అభివృద్ధి చేస్తున్నట్టు వివరించారు. ప్రకృతి వరప్రసాదంగా ఏర్పడిన గండికోట ప్రాంతం భారత్ గ్రాండ్ కాన్యన్ గా పేరొందిందని అన్నారు. దీంతో పాటు 13 శతాబ్దంలో కాకతీయులు నిర్మించి, ఆ తర్వాత విజయనగర రాజులు పాలించిన ఈ ప్రాంతం చారిత్రక సంపదకు ప్రతిరూపంగా ఉందని స్పష్టం చేశారు. గండికోట ప్రాంతాన్ని సాస్కీ కింద రూ.78 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసేందుకు...
ఏపీలో 199 మంది పోలీసులకు పోస్టింగులు, జీతాలు ఇవ్వడం లేదని వైసీపీ ఎంపీ గురుమూర్తి.. ప్రధాని దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ వరకూ అందరికీ లేఖలు రాశారు. ఇది రాజ్యాంగవిరుద్ధమని అందులో చెప్పుకొచ్చారు. ఈ 199 మందిలో ఐపీఎస్ అధికారులు నలుగురే ఉన్నారని కూడా ఆయన చెప్పారు. అంటే జగన్ సేవలో మునిగితేలి..అప్పటి ప్రతిపక్ష నేతలను వేధించిన వారంతా ఇప్పుడు పోస్టింగులు తెచ్చుకున్నారు. నలుగు ఐపీఎస్‌లకు మాత్రమే పోస్టింగులు రాలేదు.
అదే సమయంలో 4 మంది నాన్-క్యాడర్ పోలీసు సూపరింటెండెంట్లు, 1 ఏపీఎస్పీ కమాండెంట్, 27 మంది అదనపు ఎస్పీలు, 42 మంది డిప్యూటీ సూపరింటెండెంట్లు , 119 మంది సీఐలు ఈ జాబితాలో ఉన్నారని వీరందర్ని వీఆర్‌లో ఉంచారని ఆయన చెప్పుకొచ్చారు. వైసీపీ కోసం ఎంతో తీవ్రమైన తప్పులు చేసిన వాళ్లే వీళ్లంతా. వీరిని...