రామచంద్రపురం గంగవరం మండలాల్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలి
గొల్లపాలెంలో విద్యార్థుల భారీ ప్రదర్శన
సంఘీభావం తెలిపిన నాయకులు
విశ్వం వాయిస్ ప్రాంతీయ డెస్క్, కాజులూరు
రామచంద్రపురం నియోజకవర్గ అఖిల పక్ష జాయింట్ యాక్షన్ కమిటీ (జెఏసీ) ఆధ్వర్యంలో కాజులూరు మండలం గొల్లపాలెంలో కాజులూరు జంక్షన్ నుండి మార్కెట్ సెంటర్ వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా రామచంద్రపురం, కే గంగవరం మండలాలను కాకినాడ జిల్లాలో విలీనం చేయాలంటూ విద్యార్ధులు నినాదాలు చేశారు. ఈ సందర్బంగా నియోజకవర్గ జెఏసీ కన్వీనర్ మాగాపు అమ్మిరాజు, కో-కన్వీనర్ బి.సిద్ధూ, శ్రీ కాకతీయ జూనియర్ కళాశాల కరెస్పాండంట్ చెల్లుబోయిన రాంబాబు తదితరులు మాట్లాడారు. అమలాపురం పార్లమెంట్ బీసీ నాయకులు కడలి రాంపండు, స్థానిక సర్పంచ్ పోతురాజు ప్రసన్నమౌనిక, బాబురావు, సొసైటీ...
రాష్ట్ర ఎస్సీసెల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ డైరెక్టర్ గా సోమాలమ్మ
మంత్రి సుభాష్ కి కృతజ్ఞతలు
విశ్వం వాయిస్ పాలిటికల్ డెస్క్, కాకినాడ
రాష్ట్ర ఎస్సీసెల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ డైరెక్టర్ గా కాజులూరు మండలం గొల్లపాలెం ధనలక్ష్మి పేటకు చెందిన బోమిడి సోమాలమ్మ ఎంపికయ్యారు. నిరుపేద కుటుంబానికి చెందిన సోమాలమ్మని రాష్ట్ర స్థాయి పదవికి ఎంపిక చేయడం పట్ల కాజులూరు మండల దళిత సంఘ నాయకులు, పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈసందర్బంగా సోమాలమ్మ మాట్లాడుతూ టీడీపీ కోసం పడ్డ కష్టాన్ని గుర్తించి తనకు మంచి గుర్తింపు ఇచ్చిన రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్, సత్యం ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యంలకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు....