విశ్వం వాయిస్ న్యూస్, కుకట్పల్లి
హైదరాబాద్ నగరాన్ని కుదిపేసిన కుకట్పల్లి సహస్ర హత్య కేసులో సంచలన పరిణామం వెలుగులోకి వచ్చింది. 10 ఏళ్ల సహస్రపై దారుణ హత్య జరిపిన నిందితుడు పెద్దవాడు కాదని, 14 ఏళ్ల పదో తరగతి చదువుతున్న బాలుడేనని పోలీసులు వెల్లడించారు.
సహస్ర ఆగస్టు 21న కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు తీవ్రంగా వెతికిన తర్వాత రెండవ రోజు ఆమె మృతదేహం కుకట్పల్లిలోని ఓ ఇల్లు వద్ద లభ్యమైంది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుండగా, పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి దర్యాప్తు ప్రారంభించారు.
సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు, స్థానిక విచారణ ఆధారంగా చివరికి పోలీసులు చిన్నారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు సహస్రతో స్నేహం ఉన్నట్లు, ఒక చిన్న విషయంపై...