బహిరంగ సభ నిర్వహిస్తే భారీ స్థాయిలో ప్రజలు వస్తారని ప్రవీణ్ పగడాల మృతి హత్యగా ప్రజలు నమ్ముతారని భయంతో బహిరంగ సభ నిర్వహించేందుకు అనుమతి నిరాకరణ - మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్
విశ్వం వాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం
రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ న్యూస్;
పాస్టర్ ప్రవీణ్ పగడాల బహిరంగ సభకు అనుమతి ఇచ్చేవరకు వదిలే ప్రసక్తే లేదని మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ పేర్కొన్నారు. గురువారం రాజమహేంద్రవరం రాజీవ్ గాంధీ డిగ్రీ కాలేజీ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ప్రవీణ్ పగడాల కేసు విషయంలో భయపడుతున్నారని అన్నారు. ప్రవీణ్ పగడాల బహిరంగ సభ కోసం ఆరుసార్లు పోలీసులకు అనుమతి కోసం దరఖాస్తు చేసినట్లు...