విశ్వం వాయిస్ ఫిల్మ్ బ్యూసో,
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘కుబేరా’తో ఘన విజయాన్ని అందుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, ఇప్పుడు మరో పెద్ద ప్రాజెక్ట్‌కి సైన్ చేసినట్లు సమాచారం. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమా AA22లో రష్మిక కీలక పాత్రలో కనిపించబోతుందన్న వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కి భారీ స్థాయిలో క్రేజ్ ఉంది. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ దీపికా పడుకోణే ప్రధాన హీరోయిన్‌గా ఎంపిక అవడం, మిగతా క్యాస్టింగ్ మీద కూడా పాజిటివ్ బజ్‌ను కలిగించింది. తాజాగా రష్మిక మందన్నా పేరు కూడా ఫిక్స్ అయ్యిందనే న్యూస్‌తో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.
‘పుష్ప’ సిరీస్‌లో బన్నీతో రష్మిక చూపిన కెమిస్ట్రీ అభిమానులకు ఎంతగానో నచ్చింది. ఇప్పుడు AA22లో మళ్లీ ఆ జోడీ...