dd
విశ్వం వాయిస్ ఫిల్మ్ బ్యూసో,
ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో వచ్చిన ‘8 వసంతాలు’ సినిమాకు ఇప్పుడు ఓటీటీ తెరలపైకి ఎంట్రీ లభించింది. గత నెలలో థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్‌ను అందుకున్న ఈ సినిమా, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. అందరూ కుటుంబసభ్యులతో కలిసి చూసేందుకు సరైన ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్‌గా పేరుపొందిన ఈ సినిమా, తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ అందుబాటులో ఉంది.
హను రెడ్డి, రవి దుగ్గిరాల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో వచ్చిన సంగీతం ప్రేక్షకులను కనెక్ట్ చేసింది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా, చిన్న బడ్జెట్‌లో తెరకెక్కి పెద్ద విజయాన్ని అందుకున్న సినిమాగా గుర్తింపు పొందింది.
థియేటర్‌లో...