విశ్వం వాయిస్ ఫిల్మ్ బ్యూసో,
తాజాగా కోలీవుడ్‌లో జరుగుతున్న పెద్ద చర్చకు హీరోయిన్ నయనతార సమాధానం ఇచ్చింది. తన భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో విడిపోతున్నారనే వార్తలపై నయనతార సోషల్ మీడియాలో క్లియర్ కౌంటర్ ఇచ్చారు. పుకార్లను ఖండిస్తూ విఘ్నేశ్‌తో క్యూట్ ఫొటో షేర్ చేస్తూ, ‘‘మా మీద వచ్చే సిల్లీ న్యూస్‌లను చూసినప్పుడు మా రియాక్షన్ ఇదే’’ అంటూ సరదా కామెంట్ పెట్టారు.
కొద్ది రోజులుగా నయనతార తన సోషల్ మీడియాలో పెట్టిన ఒక భావోద్వేగ పోస్టు కారణంగా విడాకుల వదంతులు మొదలయ్యాయి. ఆ పోస్టులో ‘‘తెలివితక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం తప్పు. భర్త చేసిన తప్పులకు భార్య బాధ్యత ఎందుకు తీసుకోవాలి?’’ అని అర్థమయ్యేలా వాఖ్యలు ఉండటంతో కోలీవుడ్ మీడియాలో...