రావులపాలెం, ఈతకోట గ్రామంలో అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులకు ఆర్థిక సహాకారాన్ని అందించి అండగా నిలిచిన సేవా సంస్థ సభ్యులు.
రావులపాలెం, అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులకు ఆర్థిక సహాకారాన్ని అందించి అండగా నిలిచిన సేవా సంస్థ సభ్యులు. మండలం పరిధిలోని ఈతకోట గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో పెంకుటిల్లు పూర్తిగా కాలిపోయి సర్వం కోల్పోయిన కొల్లి సత్యవతిని ఆమె కుమారులను కుటుంబ సభ్యులను మంగళవారం నాడు రావులపాలెంకు చెందిన శ్రీ కాశీ అన్నపూర్ణదేవి సేవా సంస్థ ఆధ్వర్యంలో సభ్యులు పరామర్శించి బాధిత కుటుంబాలకు 30,116 రూపాయల చెక్కును ఆర్థిక సాయంగా అందజేశారు బట్టలు. బియ్యం నిత్యవసర సరుకులు మంచం. టేబుల్ ఫ్యాన్ సంస్థ సభ్యులు అందజేశారు అన్నపూర్ణదేవి సేవా సంస్థ సభ్యుడు వెలగల కాశీరెడ్డి మంచాలు పరుపులు తలగడలు దుప్పట్లను అందజేశారు ఈ సందర్భంగా పలువురు గ్రామ పెద్దలు మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి మేమున్నామంటూ అండగా నిలుస్తూ ఎక్కడ ఏం జరిగిన వారి దృష్టికి రావడంతో తక్షణమే మానవత్వంతో ముందుకు వచ్చి శ్రీ కాశీ అన్నపూర్ణదేవి సేవా సంస్థ సభ్యులు చేయూతనిస్తూ చేస్తున్న సేవల్ని వారు నిర్వహిస్తున్న అనేక సేవా కార్యక్రమాలను అభినందించారు.

