ఆటలు,సాంస్కృతిక కార్యక్రమాలతో కన్నుల పండువగా సాగిన మెగా పి.టి.ఎమ్ 2.0
తల్లిదండ్రులు నెలకు ఒకసారైనా పాఠశాలను సందర్శించండి
మెగా పేరెంట్స్-టీచర్స్ మీట్ లో ప్రధానోపాధ్యాయురాలు శాంతి సునీత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా, ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలోనూ, ప్రత్యేక ఆఫీసర్ సారథ్యంలో, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు,జూనియర్ కళాశాలలలో గురువారం మెగా పేరెంట్-టీచర్ మీట్ 2.0 (మెగా పి.టి.ఎమ్ 2.0)ను ఘనంగా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సందడి వాతావరణం నెలకొనగా, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని, పాఠశాలలో చదువుతున్న తమ పిల్లల విద్యా,విధానాలపై అవగాహన పొందడానికి మంచి వేదికగా మారింది. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండల కేంద్రమైన రాయవరంలో శ్రీ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో మెగా పేరెంట్స్-టీచర్స్ మీట్ ను ప్రత్యేక అధికారి మండల తహసీల్దార్ ఐ.పీ శెట్టి ఆధ్వర్యంలో, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి శాంతి సునీత అధ్యక్షతన వేడుకగా కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత విద్యార్థుల తల్లిదండ్రులు,తమ పిల్లలతో కలిసి తరగతి గదిలో పాల్గొనగా ఉపాధ్యాయులు,విద్యార్థుల ప్రవర్తన,తీరుపై సమీక్ష నిర్వహించి వివరించగా తదుపరి విద్యార్థుల తల్లిదండ్రులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో మ్యూజికల్ చైర్, రంగవల్లులు, థగ్ ఆఫ్ వార్ వంటి పలు పోటీలను నిర్వహించారు, అనంతరం సభ ను ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ వైద్యులు డాక్టర్ జి.ఎస్.ఎన్ రెడ్డి, రాయవరం గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉండవల్లి రాంబాబు లు పాల్గొన్నారు, తొలుత ఎమ్మార్వో ఐ.పి శెట్టి, ఉండవల్లి రాంబాబు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా, విద్యార్థిని, విద్యార్థులు సాంస్కృతిక నృత్యాలు, స్కిట్ లతో ఆలోచింప చేశారు. అనంతరం ప్రధానోపాధ్యాయురాలు సునీత మాట్లాడుతూ తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనమే మెగా పేరెంట్స్ మీట్ అని, ఇలాంటి గొప్ప కార్యక్రమాలతో కొన్ని నూతన అధ్యాయానికి ప్రభుత్వం స్వీకారంచుట్టిందని కొనియాడారు, మండల విద్యాశాఖాధికారి సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉన్నత విద్యావంతులు గా ఎదగ వచ్చని, తామంతా ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించిన వారమేనని, కార్పొరేట్ పాఠశాలకు ఏమాత్రం తగ్గకుండా, ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను అందిపుచ్చుకుని ఉన్నత విద్యావంతులుగా ఎదగాలని, చదువుకుంటున్న విద్యార్థులను తల్లిదండ్రులు పనుల పేరుతో ఇబ్బంది కలిగించ వద్దని వారిని గారాబం చేయక విద్యాపరంగా ప్రోత్సహించాలని సూచించారు, ఎమ్మార్వో ఐపీ శెట్టి మాట్లాడుతూ, విద్యార్థులు చదువుకునే సమయంలో తల్లిదండ్రులు టీవీ, సెల్ ఫోన్ వంటి వాటితో కాలక్షేపం చేస్తే వారు కూడా ఆ పద్దతి నే ఇష్టపడతారని, వారి ప్రయాణంలో తల్లిదండ్రుల పాత్ర ముఖ్యమని బాధ్యతతో పిల్లలను కనిపెట్టాలని సూచించారు, ముఖ్య అతిథులు మాట్లాడుతూ సాంకేతికత పెరిగి అధికమైన చెడు వైపుకు దారి తీస్తుందని,సాంకేతికతను మంచి విషయాలకు ఉపయోగించాలని, తల్లిదండ్రులు పిల్లల విధానాలను పరిశీలించాలని, ఉపాధ్యాయులు తరగతి గదిలో విద్యాబుద్ధులు నేర్పినా, తల్లిదండ్రుల విధానాలు వారికి జీవిత పాఠాలు నేర్పిస్తాయని గమనించాలని కోరారు. అనంతరం విద్యార్థులతో వారి తల్లిదండ్రులకు పాదపూజ చేయించి గౌరవించారు, పలు పోటీలలో గెలిచి, విజేతలుగా ప్రధమ,ద్వితీయ స్థానాలను సాధించిన తల్లిదండ్రులకు బహుమతులు అందించారు, ముఖ్య అతిథుల సారథ్యంలో విద్యార్థులకు మొక్కలు అందించి, వాటికి గుర్తింపు పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ దేవిశెట్టి కోటేశ్వరరావు, వైస్ చైర్మన్ శాఖా ధనలక్ష్మి, డివైఇవో పి రామ లక్ష్మణమూర్తి, ఎంఈఓ వై సూర్యనారాయణ, కోఆఫ్టెడ్ మెంబెర్స్ కోణాల వెంకటరెడ్డి, పోతంశెట్టి శ్రీనివాసరెడ్డి, పొరుపు రెడ్డి పద్మ, బిసి సెల్ నాయకులు దొంతంశెట్టి బాలకేదారీశ్వరుడు,కె వెంకట రమణ,కె సురేష్ , మండల బిజెపి కార్యకర్త నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, విద్యార్థులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు

