డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండల కేంద్రమైన రాయవరంలో తరచుగా తిడుతున్నాడని, తండ్రిపై కోపం పెంచుకొని సుత్తితో పలుమార్లు దాడి చేసిన ఘటనతో హత్యాయత్నం కేసులో, నిందితునిగా ఉన్న రాజరాజేశ్వరి కాలనీకి చెందిన గంటా పవన్ కళ్యాణ్ ను శనివారం అదుపులోకి తీసుకుని, మండపేట రూరల్ సీఐ పి.దొరరాజు పర్యవేక్షణలో దర్యాప్తు చేసి, అనపర్తి జె.ఎఫ్.సి.ఎమ్ మెజిస్ట్రేట్ కోర్టు లో హాజరు పరచగా నిందితుడైన గంటా పవన్ కళ్యాణ్ కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించినట్లు రాయవరం ఎస్సై సురేష్ బాబు తెలిపారు.