విద్యా గణపతి పూజ…
మండపేట పట్టణం 4వ వార్డు తర్వణిపేటలో వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నవరాత్రి పూజ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం విద్యా గణపతి పూజ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు.ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, మండపేట మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ నూక దుర్గారాణి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలో పాల్గొన్న చిన్నారులకు పుస్తకాలు, పెన్ లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాలుగా చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఎనిమిదవ సంవత్సరం ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని అన్నారు. చిన్నారులకు సాంప్రదాయం పట్ల అవగాహన కల్పించడంలో భాగంగా ప్రతి సంవత్సరం విద్యా గణపతి పూజ నిర్వహిస్తున్నామన్నారు. సెప్టెంబర్ మూడవ తేదీన శ్రీ లక్ష్మీ గణపతి హోమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. భక్తులు పూజలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్, నాలుగో వార్డ్ కౌన్సిలర్ గుండు రామ తులసి, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మచ్చానాగు, ఆలయ కమిటీ సభ్యులు గుండు వీర తాతరాజు, గ్రంధి బుల్లిబాబు, జర్నలిస్ట్ జాయన సాయి సత్యనారాయణ, జర్నలిస్ట్ మోహన్ రావు, పొలమూరి శ్రీనివాస్,పోలమూరు త్రినాథ్, కోడూరి నాగరాజు, ఆరేటి మహేష్, బొల్లంరెడ్డి స్వామి, రెడ్డి రవిరాజు, కే రామకృష్ణ, ఏ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

