Friday, August 1, 2025
🔔 10
Latest Notifications
Friday, August 1, 2025
🔔 10
Latest Notifications

తోట నరసింహానికి, నాకు విమర్శించే హక్కు లేదు

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

ఆయన నేను పలు పార్టీలు మారాము
ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

స్థానిక టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రిని వంచనపరుడు అని విమర్శించడం తోట నరసింహానికి తగదని అన్నారు. ప్రభుత్వం తల్లికి వందనం అందజేసిందని, ఉచిత సిలిండర్లు అందిస్తుందని, ఈ నెలలో రైతులకు అన్నదాత సుఖీభవ ఇస్తున్నామని, ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని ఇవి కనపడట్లేదా నరసింహం అని ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యంగా మీ పక్క గ్రామం గెద్దనాపల్లిలో ఐదుగురికి తల్లికి వందనం, మీ ఇంటి పక్కన ఉన్నవారికి నలుగురికి తల్లికి వందనం వేయడం జరిగింది ఇవి కనపడటం లేదని నరసింహం అని ఆయన అన్నారు. ముఖ్యంగా తోట నరసింహం, నేను ఎవరిని విమర్శించే హక్కు లేదని మేము అన్ని పార్టీలు మారి వచ్చామని అన్నారు. ముఖ్యంగా తోట నరసింహం ఆరోజు పార్లమెంటు సభ్యుడిగా టిడిపి నుండి సీటు ఇచ్చినప్పుడు వంచన పరుడు చంద్రబాబు కనపడలేదా అని అన్నారు. కాంగ్రెస్ లో ఉండి ఆఖరి నిమిషంలో తెలుగుదేశం పార్టీలో చేరి పార్లమెంటు సభ్యుడిగా, తర్వాత మళ్లీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి పెద్దాపురం, తర్వాత జగ్గంపేట నుండి పోటీ చేయడం ఈరోజు ఆయన మాట్లాడే హక్కు లేదని ఎందుచేతనంటే ఎమ్మెల్యేగా, మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా 20 సంవత్సరాలు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉంటూ ఉన్న గ్రామానికి రోడ్డు వేయించుకోలేని పరిస్థితి ఆయనదని ఎమ్మెల్యే అన్నారు. నేను పార్టీలు మారాను కానీ నియోజకవర్గ అభివృద్ధి కోసం అనేక నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని ముందుకు నడిపించాలని ఆయన పార్టీలు మారి నియోజకవర్గానికి ఏం తీసుకొచ్చారు తెలియజేయాలని లేదంటే ముఖాముఖి చర్చకు సిద్ధమా అని జ్యోతుల నెహ్రూ సవాల్ విసిరారు. మా కార్యకర్తలు దోచుకు తింటున్నారని ఆయన పత్రికా సమావేశం అంటున్నారు. మీ కార్యకర్తలు ప్రభుత్వ నిధులతోపాటు మీ సొంత నిధులు కూడా దోచుకున్నారని మీరే చెప్పుకున్నారని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, సత్తి సదాశివరెడ్డి, కుంచే తాతాజీ, బద్ది సురేష్, పాఠంశెట్టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
రాజకీయాలు
కాకినాడ
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo