శాంతి యుత జీవనానికి మధ్య వర్తిత్వం సులువైన మార్గం అని 9వ అదనపు జిల్లా జడ్జి ఎం అనురాధ అన్నారు. రాష్ట్ర మరియు జిల్లా న్యాయాధికార సంస్థల ఆదేశాల మేరకు శనివారం కొవ్వూరు పట్టణంలోని కోర్ట్ ప్రాగణం నందు చైర్మన్ 9 వ అదనపు జిల్లా జడ్జి ఎం .అనురాధ మధ్య వర్తిత్వం న్యాయ వాదులతో సమేవేశం నిర్వహించారు .కొవ్వూరు కోర్ట్ ప్రాగణం నందు జులై 10వ తేదీ నుండి సెప్టెంబర్ 30 తేదీ వరకు 90రోజులు పాటు మధ్యవర్తిత్వం తో కేసులు పరిష్కారం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మీడియేషన్ ఓ పి కేసులలో ౩౦ జంటలకు మీడియేసన్ జరపగా ఒక ఓ పి కేసులో ఒక జంట ను కలపడం జరిగింది.

ఈ సందర్భంగా 9 వ అదనపు జిల్లా జడ్జ్ ఎం అనురాధ మాట్లాడుతూ కక్షి దారులమధ్య మనస్పర్థలు లేకుండా సత్వర న్యాయం కోసం మధ్య వర్తిత్వం ద్వారా సమన్యాయం జరుగుతుందని, దీర్ఘ కాలిక కేసుల పరిష్కరని కి రాజీయే రాజమార్గం అని అన్నారు .కోర్ట్ ల లో ఏళ్ళ తరబడి పెండింగ్ లో ఉన్న కేసుల పరిష్కారంలో కక్షి దారులు మధ్య వర్తిత్వం ద్వారా రాజీ పడితే తమ విలువైన సమయన్ని డబ్బు ను ఆదా చేసుకొని ప్రశాంతమైన జీవితాన్ని గడప వచ్చునని తెలిపారు.కేసుల రాజీకి ప్రత్యే కంగా శిక్షణ పొందిన న్యా య వాదులను నియమించడం జరిగిందని వారి సేవలను వినియోగించు కోవాలని అన్నారు .ఈ కార్య క్రమం లో సీనియర్ సివిల్ జడ్జి జి .వి .యల్ .సరస్వతి, మీడియేటర్లు పాల్గొన్నారు

